పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-298.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొనర ధౌతాంఘ్రిపాణి యై యుత్తరంబు
ముఖముగా నుత్తమాసనమున వసించి
కృ నిజాంగ కరన్యాస తిశయిల్ల
హిత నారాయణాఖ్య వర్మము నొనర్చె.

టీకా:

విను = వినుము; అయ్య = తండ్రి; నరనాథ = రాజా; ముని = మునులలో; నాథుడు = ప్రభువు; ఇంద్రున్ = ఇంద్రుని; కున్ = కు; అనువు = అనుకూలము; ఒందన్ = పొందునట్లుగ; నారాయణ = నారాయణ; ఆఖ్యము = పేరు గలది; ఐన = అయిన; కవచంబు = రక్షణతొడుగు వంటి మహామంత్రము; విజయ = విజయమును; సంకల్పంబున్ = చక్కగా కలిగించెడిది; అప్రమేయ = అపరిమితమైన; స్వరూపంబు = స్వరూపము గలది; మహా = గొప్ప; ఫలంబు = ఫలితముల నిచ్చునది; మంత్ర = మంత్రములలో; గోప్యము = రహస్యముగా దాచదగినది; హరి = నారాయణుని; మాయా = మాయతోకూడి; విశేషంబు = విశిష్టమైనది; సాంగంబుగాన్ = అంగన్యాస కరన్యాసములతో సంపూర్ణంగా; ఎఱుంగజేసెద = తెలిపెదను; దానిన్ = దానిని; నేన్ = నేను; వినిపింతు = చెప్పెదను; పూని = ధారణ కలిగి; తదేకాగ్ర = దాని యందే లగ్నమైన; చిత్తంబు = మనసు; తోడుత = తోటి; చిత్తగింపుము = వినుము; ఒనర = సిద్దపరుచుకొన్న;
ధౌత = శుభ్రముగా కడుగుకొన్న; అంఘ్రి = పాదములు; పాణి = చేతులు గలవాడవు; ఐ = అయ్యి; ఉత్తరంబు = ఉత్తరపు; ముఖముగా = వైపునకు చూచువాడవై; ఉత్తమ = మంచి; ఆసనమున = ఆసనముపైన; వసించి = ఉండి; కృత = చేసిన; నిజ = తన యొక్క; అంగ = అవయవములు; కర = కరములను; న్యాస = వాడుటలు; అతిశయిల్ల = అతిశయించునట్లు; మహిత = గొప్ప; నారాయణ = నారాయణ; వర్మము = కవచము; ఒనర్చె = కలిగించెను.

భావము:

“రాజా! విను. విజయాన్ని చేకూర్చేది, ఊహించడానికి వీలుకాని ప్రభావం కలది, మహాఫలాన్ని ఇచ్చేది, రహస్యంగా కాపాడుకోదగినది, వైష్ణవీ మాయాస్వరూపమైనది అయిన నారాయణ కవచాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి సాంగోపాంగంగా ఉపదేశించాడు. దాని విధానాన్ని నేను వినిపిస్తాను. ఏకాగ్రచిత్తంతో విను. ముందుగా కాళ్ళు, చేతులు కడుక్కొని, ఉత్తర ముఖంగా ఉత్తమాసనంపై కూర్చొని, అంగన్యాస కరన్యాసాలు చేసి గొప్పదైన ఈ నారాయణ కవచాన్ని ప్రయోగించాలి.