పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-295-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఎందును రక్షితుం డగుచు నింద్రుఁడు లీలయ పోలె వైరి సే
నం దునుమాడి దేవతలు మ్మి సుఖింపఁగ నిష్ఠసంపదం
జెంది సమస్తలోకముల జేకొని యేలె మునీంద్ర! దాని నే
విందు సుఖంబుఁ గందు నిఁక వీనులు సంతస మందఁ బల్కవే.

టీకా:

ఎందునున్ = దేనివలన; రక్షితుడు = రక్షింపబడినవాడు; అగుచు = అగుచు; ఇంద్రుడు = ఇంద్రుడు; లీలయ = ఆటను; పోలె = వలె; వైరి = శత్రు; సేనన్ = సేనలను; తునుమాడి = సంహరించి; దేవతలు = దేవతలు; నమ్మి = నమ్మకముగా; సుఖింపగన్ = సుఖించుతుండగా; ఇష్ట = కోరిన; సంపదన్ = సంపదలను; చెంది = పొంది; సమస్త = అఖిలమైన; లోకములన్ = లోకములను; చేకొని = చేపట్టి; ఏలెన్ = పరిపాలించెనో; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివాడ; దానిన్ = దానిని; నేన్ = నేను; విందు = వినెదను; సుఖంబున్ = సుఖములను; కందున్ = చూసెదను; ఇంక = ఇకపైన; వీనులు = చెవులు; సంతసమున్ = సంతోషమును; అందన్ = పొందగా; పల్కవే = చెప్పుము.

భావము:

దేనివల్ల ఇంద్రుడు సురక్షితంగా అవలీలగా శత్రుసైన్యాన్ని నిర్జించి దేవతలు సుఖపడే విధంగా కోరిన సంపదలను పొంది సర్వలోకాలను స్వాధీనం చేసికొని పరిపాలించాడో ఆ విద్యా స్వరూపాన్ని వినగోరుతున్నాను. వీనుల విందుగా వినిపించు.”