పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-293-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విద్యచేత రక్షితుఁ
డై జ్రి దురంబులోన సురలఁ ద్రుంచెన్
భావింప నట్టి విద్యను
శ్రీరమాయామతంబుఁ జెప్పెను హరికిన్. "

టీకా:

ఏ = ఏ; విద్య = విద్య; చేతన్ = వలన; రక్షితుడు = రక్షింపబడినవాడు; ఐ = అయ్యి; వజ్రి = ఇంద్రుడు {వజ్రి - వజ్రమ ఆయుధముగా గలవాడు, ఇంద్రుడు}; దురంబులోనన్ = యుద్ధములో; అసురులన్ = రాక్షసులను; త్రుంచెన్ = సంహరించెను; భావింపన్ = తలచుకొనగ; అట్టి = అటువంటి; విద్యన్ = విద్యను; శ్రీవర = విష్ణుమూర్తి యొక్క; మాయా = మాయయొక్క; మతంబున్ = విధానమును; చెప్పెను = చెప్పెను; హరి = ఇంద్రుని; కిన్ = కి.

భావము:

ఏ విద్యచేత ఇంద్రుడు సురక్షితంగా యుద్ధంలో రాక్షసులను ఓడించాడో అటువంటి విష్ణుమాయా తత్త్వం అయిన నారాయణ కవచం అనే విద్యను దేవేంద్రునికి చెప్పాడు”.