పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-292-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భార్గవవిద్యా గుప్త
స్వర్గశ్రీ ద్విగుణ దనుజ మధిక సంప
ద్వర్గముల విష్ణుమాయా
ర్గళగతిఁ దెచ్చి యింద్రుకు నిచ్చె నృపా!

టీకా:

భార్గవ = శుక్రుని {భార్గవుడు - భర్గుని యొక్క పుత్రుడు, శుక్రుడు}; విద్యా = విద్యవలన; గుప్త = కాపాడబడుతున్న; స్వర్గశ్రీ = స్వర్గసంపదలకు; ద్విగుణ = రెట్టింపుగల; దనుజ = రాక్షసులకంటెను; సమధిక = అత్యధికమైన; సంపద = సంపదలు; వర్గములన్ = సమూహములను; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయ = మాయను; అనర్గళ = అడ్డులేని; గతిన్ = విధముగ; తెచ్చి = తీసుకు వచ్చి; ఇంద్రున్ = ఇంద్రుని; కు = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; నృపా = రాజా.

భావము:

రాజా! శుక్రాచార్యుల మంత్రప్రభావం వల్ల రాక్షసుల సంపదలు దేవతల కంటే రెండింతలైనాయి. అటువంటి రాక్షసుల ఐశ్వర్యానికి మించిన రాజ్యసందను విశ్వరూపుడు విష్ణుమాయ వలన దేవేంద్రునికి సాధించి పెట్టాడు.