పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-291.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుచు విశ్వరూపుఁ నియెడు ముని ప్రతి
జ్ఞోక్తిఁ బలికె వారి నూఱడించి
హితమైన తత్సమాధిచే గురుభావ
మరఁ జేసె దేవమితి కపుడు.

టీకా:

అరయ = తరచి చూసినచో; అకించనులు = నిరుపేదలు; ఐనట్టి = అయినటువంటి; వారి = వారి; కిన్ = కి; తగు = తగిన; శిల = దంచినచోట రాలిన గింజలేరి తినుట; ఉంఛన = పొలములలో రాలిపడెడి గింజలను ఏరుకొని తిని బ్రతికెడి; వృత్తి = వృత్తియే, జీవికయే; ధనము = సంపద; సుమ్ము = సుమా; దాని = దాని; చే = చేత; నిర్వర్తిత = నిర్వహించెడి; ప్రియ = ఇష్టపూర్తిగా; సాధు = సాధుత్వపు; సత్ = మంచి; క్రియ = కార్యములు; కలవారు = చేసెడివారు; ఐ = అయ్యి; ప్రీతిన్ = సంతోషమును; ఒందెదరు = పొందెదరు; కాన = కావున; సత్ = మంచివారిచేత; గర్హిత = నిందింపబడెడి; ఆచారము = వ్యవహారము; ఐన = అయిన; ఆచారత్వమున్ = గురుత్వమునకు; ఇపుడు = ఇప్పుడు; మీ = మీ యొక్క; శాసనమునన్ = ఆజ్ఞ ప్రకారము; కైకొంటిన్ = స్వీకరించితిని; గురువుల = గురువుల నుండి; కామంబు = ఆశింపదగినది; ప్రాణ = ప్రాణముల కైనను; అర్థ = ధనముల కైనను; వంచనములు = మోసములు చేయుట; లేక = లేకుండగ; వడిన్ = శ్రీఘ్రమే; ఒనర్తున్ = చేసెదను; అనుచు = అనుచూ;
విశ్వరూపుడు = విశ్వరూపుడు; అనియెడు = అనెడు; ముని = ముని; ప్రతిఙ్ఞ = ప్రతిన; ఉక్తిన్ = చేసి; పలికె = చెప్పెను; వారిన్ = వారిని; ఊఱడించి = ఉపశమింపజేసి; మహితము = గొప్పది; ఐన = అయినట్టి; తత్ = అతని; సమాధి = యోగసమాధి; చే = చేత; గురుభావము = గురుత్వమును; అమరన్ = చక్కగా; చేసె = చేసెను; దేవ = దేవతల; సమితి = సమూహమున; కు = కు; అపుడు = అప్పుడు;

భావము:

ఏమీ లేని దరిద్రులకు కళ్ళంలో రాలిన గింజలను ఏరుకొని తినే జీవితమే ధనం. ఆ వృత్తితో జీవిస్తూ కూడా వారు సత్కార్యాలు చేస్తూ సంతుష్టిని పొందుతారు. అటువంటి సత్పురుషులు తిరస్కరించే గురుత్వాన్ని మీ కోరిక మేరకు స్వీకరిస్తున్నాను. స్వార్థం, వంచన లేకుండా మీ కోరిక నెరవేర్చి మీకు మేలు చేస్తాను” అని ఆ విశ్వరూప మునీంద్రుడు ప్రతిజ్ఞ చేసి వారికి ఓదార్చాడు. సమాధి నిష్ఠుడై దేవతల ఆచార్యత్వాన్ని అంగీకరించాడు.