పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-288-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బ్రహ్మతేజంబు పోయెడి ప్రార్థనంబు
ర్మగుణ గర్హితం బని తా నెఱింగి
సొరిది ననుబోఁటి తపసి యీ సురలచేతఁ
బ్రకట మధురోక్తి నేఁటికిఁ లుకఁబడియె.

టీకా:

బ్రహ్మతేజంబు = బ్రహ్మతేజస్సు; పోయెడి = నష్టపోయెడి; ప్రార్థనంబు = కోరికలను; ధర్మ = ధర్మబద్ధమైన; గుణ = గుణములచే; గర్హితంబు = తిరస్కరింపబడునది; అని = అని; తాన్ = తను; ఎఱింగి = తెలిసి; సొరిదిన్ = క్రమముగా; నను = నా; పోటి = వంటి; తపసి = తపస్వి; ఈ = ఈ; సురల = దేవతల; చేతన్ = చేత; ప్రకట = ప్రసిద్ధముగ; మధుర = తీయటి; ఉక్తిన్ = మాటలతో; ఏటికి = ఎందులకు; పలుకబడియె = పలుకబడెను.

భావము:

ధర్మవిరుద్ధమైన మీ ప్రార్థనను అంగీకరిస్తే నా బ్రహ్మతేజస్సు నశిస్తుంది. నావంటి తాపసిని మీవంటి పెద్దలు ఇంత తీయని మాటలతో పొగడటం ఎందుకు?