పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-286.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాన తండ్రి వేగ డు నార్తులగు పితృ
నులమైన మమ్ముఁ ల్లఁ జూచి
భయంబు వాపి నిరుపమం బగు తపో
హిమచేత మెఱసి నుపవయ్య!

టీకా:

అరయన్ = తరచి చూసిన; ఆచార్యుండు = గురువు; పరతత్త్వ = పరబ్రహ్మ; రూపంబు = స్వరూపము; తండ్రి = తండ్రి; తలపంగ = తరచి చూసిన; ధాత = బ్రహ్మదేవుడు; రూపు = స్వరూపము; రూపింప = తరచి చూసిన; భ్రాత = సోదరుడు; మరుత్పతి = ఇంద్రుడు {మరుత్పతి - మరుత్ (మరుద్గణములకు) పతి (ప్రభువు), ఇంద్రుడు}; రూపంబు = స్వరూపము; తెలియంగ = తరచి చూసిన; తల్లి = తల్లి; భూదేవి = భూదేవి; రూపు = స్వరూపము; భగిని = సోదరి; కరుణ = దయ యొక్క; రూపు = స్వరూపము; భావంబు = భావము; ధర్మ = ధర్మము యొక్క; స్వరూపంబు = స్వరూపము; తాన్ = తను; అర్థి = వేడువాని; రూపు = స్వరూపము; మొదల = ముఖ్యముగ; అభ్యాగతుడు = అతిథి; మున్న = ముందే; అగ్నిదేవుని = అగ్నిదేవుని; రూపు = స్వరూపము; సర్వ = అఖిలమైన; భూతములు = జీవులు; కేశవుని = నారాయణుని; రూపు = స్వరూపము; కాన = కావున;
తండ్రి = నాయనా; వేగ = శ్రీఘ్రమే; కడున్ = మిక్కిలి; ఆర్తులు = దుఃఖితులు; అగు = అయిన; పితృజనులము = తండ్రి సోదరవర్గము వారము; ఐన = అయిన; మమ్మున్ = మమ్ములను; చల్లన్ = దయతో; చూచి = చూసి; పర = శత్రు; భయంబు = భయమును; వాపి = పోగొట్టి; నిరుపమంబు = సాటిలేనిది; అగు = అయిన; తపస్ = తపస్సు యొక్క; మహిమ = మహత్యము; చేత = వలన; మెఱసి = అతిశయించి; మనుపు = రక్షింపుము; అయ్య = తండ్రి.

భావము:

గురువు పరమాత్మ స్వరూపుడు. తండ్రి బ్రహ్మ స్వరూపుడు. అన్న ఇంద్ర స్వరూపుడు. తల్లి భూదేవి రూపం. సోదరి దయాస్వరూపిణి. భావం ధర్మ స్వరూపం. తాను అర్థి స్వరూపం. అభ్యాగతుడు అగ్నిదేవ స్వరూపం. సర్వ ప్రాణులు విష్ణు స్వరూపం. కాబట్టి తండ్రీ! మిక్కిలి ఆపదలో ఉన్న పితృజనులమైన మమ్ము నీ చల్లని చూపు చూసి, శత్రు భయాన్ని పోగొట్టి, నీ తపోమహిమతో కాపాడు.