పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-279-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖండలుండు మొదలుగ
లేఖానీకముల బ్రహ్మ లేనగవున ని
త్యాఖండ సత్కృపారస
శేర వాక్యముల వారి సేదలు దేర్చెన్.

టీకా:

ఆఖండలుండు = ఇంద్రుడు; మొదలుగ = మొదలైన; లేఖా = దేవతల; అనీకముల = సమూహములను; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; లేనగవున = లేతనవ్వుతో; నిత్య = నిత్యమైన; అఖండ = ఎడతెగని; సత్కృప = మంచి దయా; రస = రసములలో; శేఖర = ఉత్తమమైన; వాక్యములన్ = మాటలతో; వారిన్ = వారిని; సేదలుదేర్చెన్ = ఓదార్చెను.

భావము:

ఇంద్రుడు మొదలైన దేవతల సమూహాన్ని చిరునవ్వుతో మిక్కిలి దయతో పలకరించి ఓదార్చాడు.