పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-277-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులు విసృష్ట దానవ
రులు శరభిన్న దేహ సంతాపగుణ
భ్రరులు దైత్య కిరాతక
రులు కమలజుని కడఁకుఁ నిరి భయార్తిన్.

టీకా:

అమరులు = దేవతలు {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; విసృష్ట = విడిచినట్టి; దానవ = రాక్షసులతోటి; సమరులు = యుద్ధములు గలవారు; శర = బాణములచే; భిన్న = పగిలిన; దేహ = అవయవముల; సంతాప = బాధపడెడి; గుణ = లక్షణముతో; భ్రమరులు = చలించిపోవుతున్న వారు; దైత్య = రాక్షసు లనెడి {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; కిరాతక = వేటగాడికి, కిరాతకులకు; చమరులు = చమరీ మృగముల వంటివారు; కమలజుని = బ్రహ్మదేవుని {కమలు జుడు - కమలమునందు జుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; కడ = వద్ద; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; భయ = భయము; ఆర్తిన్ = బాధతోటి.

భావము:

రాక్షసులతో యుద్ధాన్ని వదలిన దేవతలు, బాణాల వల్ల గాయపడిన దేహాలతో, వేటగాడికి బెదరిన చమరీమృగాల వలె, పారిపోయి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు.