పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-273-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున దేవదానవులు చ్చరముల్గడుఁ బిచ్చలింప సం
లను గోరి పోరునెడ భార్గవ మంత్రకళా విశేషులై
యెదురులు వాలి నస్త్రమున నేయ మహాసురు లేచియేచి పెం
గుదులుగఁ గ్రువ్వ దేవతలు కోల్తల కోర్వక వీఁగి రయ్యెడన్.

టీకా:

మదమున = మదముతో; దేవ = దేవతలు; దానవులు = రాక్షసులు; మచ్చరముల్ = మాత్యర్యములు; కడు = మిక్కిలి; పిచ్చలింప = చెలరేగగా; సంపదలను = సంపదలను; కోరి = ఆశించి; పోరున్ = యుద్ధము చేయు; ఎడన్ = సమయము నందు; భార్గవ = శుక్రాచార్యుని; మంత్ర = మంత్రాగపు, ఆలోచన; కళ = నేర్పువలన, విద్యల యొక్క; విశేషులు = విశిష్టతలు గలవారు; ఐ = అయ్యి; ఎదురులువాలి = ఎదురుగా నిలబడి; అస్త్రమునన్ = అస్త్రముతో; ఏయ = కొట్టగా; మహా = గొప్ప; అసురులు = రాక్షసులు; ఏచియేచి = విజృంభించి; పెన్ = పెద్దపెద్ద; గుదులుగ = గుత్తులుగ; గువ్వ = చుట్టుముట్టగ; దేవతలు = దేవతలు; కోల్తలు = ముట్టడి, ఎదుట నిలిచి యుద్ధము చేయుట; కు = కు; ఓర్వక = తట్టుకొనలేక; వీగిరి = ఒడిపోయిరి; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.

భావము:

దేవతలు, రాక్షసులు పెచ్చు పెరిగిన మాత్సర్యంతో సంపదల కోసం పరస్పరం పోరాడసాగారు. రాక్షస వీరులు శుక్రాచార్యుల మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతలమీద అస్త్రాలను ప్రయోగించగా దేవతలు వారి ముట్టడికి, పరాక్రమానికి తాళలేక పారిపోయారు.