పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-272-స్రగ్ద.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండిం గోదండ కాండోద్ధత రథ హయ వేదండ దండంబుతోడన్
దండెత్తెన్ మెండుగా నద్దనుజనికరముల్ దైవవర్గంబు మీఁదం
జంబ్రహ్మాండ భేదోచ్ఛ్రయ జయరవముల్ ర్వదిక్ క్షోభగా ను
ద్దంప్రఖ్యాత లీలం లపడిరి సురల్ ర్పులై వారితోడన్.

టీకా:

దండిన్ = మెండుగా; కోదండ = విల్లులు; కాండ = బాణముల; ఉద్ధత = చెలరేగుట; రథ = రథములు; హయ = గుఱ్ఱములు; వేదండ = ఏనుగుల; తండంబు = సమూహముల; తోడన్ = తోటి; దండెత్తెన్ = దండెత్తెను; మెండుగా = మిక్కిలిగా; ఆ = ఆ; దనుజ = రాక్షస; నికరముల్ = సమూహములు; దైవ = దేవతల; వర్గంబున్ = గణముల; మీదన్ = పైని; చండ = భయంకరమైన; బ్రహ్మాండ = బ్రహ్మాండమును; భేద = బద్దలు చేయుచున్నట్టి; ఉచ్ఛ్రయ = చెలరేగిన; జయ = జయజయ మనెడి; రవముల్ = శబ్దములు; సర్వ = సమస్తమైన; దిక్ = దిక్కులను; క్షోభగాన్ = సంక్షోభము చెందునట్లుగా; ఉద్దండ = అత్యధికమైన; ప్రఖ్యాత = ప్రసిద్ధమైన; లీలన్ = విధముగా; తలపడిరి = ఒండొరులను తాకిరి; సురల్ = దేవతలు; దర్పులు = గర్వించినవారు; ఐ = అయ్యి; వారి = వారి; తోడన్ = తోటి.

భావము:

గొప్ప ధనుర్బాణాలతో విజృంభించి రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులతో ఎక్కి ఆ రాక్షసుల సమూహం దేవతాగణాలపై దండెత్తింది. దేవతలు తీవ్రంగా బ్రహ్మాండం బ్రద్దలయ్యే వీరాలాపాలతో, జయజయ ధ్వనులతో, దిక్కులన్నీ క్షోభించే విధంగా వీరావేశంతో విజృంభించి వాళ్ళను ఎదిరించారు.