పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-271-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధూర్తులు సమస్త కిల్బిష
మూర్తులు వర ధర్మ కర్మ మోచిత మార్గా
ర్తులు దుర్ణయ నిర్మిత
కీర్తులు దానవులు చనిరి గీర్వాణులపై.

టీకా:

ధూర్తులు = నిందార్హులు; సమస్త = సర్వ; కిల్బిష = పాపముల; మూర్తులు = స్వరూపులు; వర = శ్రేష్ఠమైన; ధర్మ = ధర్మబద్ధమైన; కర్మ = కార్యముల నుండి; మోచిత = విమోచనమైన; మార్గ = దారి యందు; ఆవర్తులు = వర్తించెడివారు; దుర్ణయ = అవినీతిచే; నిర్మిత = నిర్మింపబడిన; కీర్తులు = యశస్సు గలవారు; దానవులు = రాక్షసులు; చనిరి = వెళ్ళిరి; గీర్వాణుల = దేవతల {గీర్వాణులు - మాటయే బాణముగా గలవారు, దేవతలు}; పై = మీదకి.

భావము:

మోసగాళ్ళు, పాపాత్ములు, ధర్మమార్గాన్ని విడిచినవాళ్ళు, అవినీతిపరులన్న చెడుపేరు తెచ్చుకున్నవాళ్ళు అయిన రాక్షసులు దేవతలపై దండెత్తారు.