పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము

  •  
  •  
  •  

6-270.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దెలిసి మిక్కిలి తమలోనఁ దెలివినొంది
యందఱును గూడి భార్గవు నాశ్రయించి
త్కృపాదృష్టిఁ దమశక్తి ట్టమైన
దేవతలమీఁది దాడికిఁ దెరువు పెట్టి.

టీకా:

ఈ = ఈ; రీతిన్ = విధముగ; తన = తన యొక్క; ఇల్లు = నివాసమున; కి = కి; ఏతెంచు = వచ్చెడి; దేవతాపతి = ఇంద్రుడు {దేవతా పతి - దేవతల యొక్క పతి (ప్రభువు), ఇంద్రుడు}; రాక = వచ్చుటను; ఆ = ఆ; బృహస్పతి = బృహస్పతి; ఎఱింగి = తెలిసికొని; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; మాయ = ప్రభావము; చేన్ = వలన; అడగి = అణగిపోయి; అదృశ్యుడు = మాయమైనవాడు; ఐపోయెను = అయ్యెను; అప్పుడు = అప్పుడు; దేవపుంగవుండు = ఇంద్రుడు {దేవ పుంగవుడు - దేవ (దేవతలలో) పుంగవుడు (శ్రేష్ఠుడు), ఇంద్రుడు}; సకలంబు = సర్వము; పరికించి = వెతికి చూసి; గురున్ = బృహస్పతిని; చింతించి = స్మరించి; తలపోసి = ఆలోచించుకొని; చిన్నపోయెన్ = చిన్నపోయెను; పోయిన = (బృహస్పతి) వెళ్ళిపోవుట; విధము = విధానమును; ఎల్లన్ = సర్వమును; దాయలు = దాయాదులు; రాక్షస = రాక్షసులైనట్టి; వీరులు = శూరులు; వేగులవారి = చారుల; వలన = వలన; తెలిసి = తెలిసికొని;
మిక్కిలి = అధికముగ; తమలోన = తమలో తాము; తెలివిన్ = తెలివిని; ఒంది = పొంది; అందఱునున్ = అందరూ; కూడి = కలిసి; భార్గవున్ = శుక్రాచార్యుని {భార్గవుడు - భర్గుని యొక్క పుత్రుడు, శుక్రుడు}; ఆశ్రయించి = చేరి; తత్ = అతని; కృపా = దయ గల; దృష్టిన్ = చూపులతో; తమ = తమ యొక్క; శక్తి = బలము; దట్టము = పెరిగినది; ఐన = కాగా; దేవతల = దేవతల; మీది = పైకి; దాడి = యుద్దమున; తెరువు = దారి; పెట్టి = నిశ్చయించి, పట్టి.

భావము:

ఈ విధంగా తన ఇంటికి దేవేంద్రుడు వస్తున్న సంగతి తెలుసుకొని బృహస్పతి ఆధ్యాత్మిక మాయచే అదృశ్యుడైనాడు. ఇంద్రుడు అంతటా వెదకి గురువు జాడ కనుగొనలేక చిన్నబోయాడు. బృహస్పతి వెళ్ళిపోయిన విషయాన్ని దేవతల దాయాదులైన రాక్షస వీరులు గూఢచారుల వలన తెలుసుకొని, తమకు తామే తెలివి తెచ్చుకొని అందరు కలిసి తమ గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించి, అతని దయచేత తమ శక్తిని పెంపొందజేసికొని దేవతల మీదికి దండయాత్రకు మార్గం కనిపెట్టి...