పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : బృహస్పతి తిరస్కారము

  •  
  •  
  •  

6-268-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుపథవర్తు లగుచుఁ గుత్సిత దుర్వచో
నిపుణు లైనవారు నిడివి దెలిసి
తొలఁగలేక వా రధోగతిఁ బడుదురు
ప్పులేక రాతి తెప్ప భంగి.

టీకా:

కుపథ = చెడుమార్గమున; వర్తులు = తిరుగువారు; అగుచున్ = అగుచు; కుత్సిత = నిందాపూర్వక; దుర్ = చెడ్డ; వచస్ = మాటలాడుట యందు; నిపుణులు = నైపుణ్యము గలవారు; ఐనవారు = అయినట్టివారు; నిడివి = నీతిమార్గము; తెలిసి = తెలుసుకొని; తొలగలేక = తొలిగిపోకుండగ; వారు = వారు; అధోగతి బడుదురు = నశించెదరు; తప్పులేక = తప్పనిసరిగా; రాతి = రాయితో చేసిన; తెప్ప = పడవ; భంగి = వలె.

భావము:

చెడు మార్గంలో నడుస్తూ కుత్సిత బుద్ధితో దుర్భాషలాడడంలో నేర్పరులైన వారు నీతిమార్గాన్ని తెలుసుకోలేక రాతిపడవ లాగా అధోగతి పాలై మునిగిపోతారు.