పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : బృహస్పతి తిరస్కారము

  •  
  •  
  •  

6-267-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పారమేష్ఠ్య మయిన దవి నొందిన భూపు
లెట్టివారి కైన లేవవలదు;
విబుధు లిట్లు చెప్పు విధమెన్న వారలు
ర్మవేత్త లనుచుఁ లఁపబడరు.

టీకా:

పారమేష్ఠ్యము = బ్రహ్మచే అనుగ్రహింపబడినది, బ్రహ్మాండము {పారమేష్ఠ్యము - పరమేష్ఠి (బ్రహ్మ) యొక్క స్థానము, బ్రహ్మాండము}; అయిన = అయినట్టి; పదవిన్ = అధికారమును; ఒందిన = పొందిన; భూపులు = రాజులు {భూపుడు - భూమికి పతి, రాజు}; ఎట్టి = ఎటువంటి; వారి = వారి; కిన్ = కి; ఐన = అయినను; లేవవలదు = లేవనక్కరలేదు; విబుధులు = జ్ఞానులు; ఇట్లు = ఈ విధముగ; చెప్పు = చెప్పెడి; విధము = విధానము; ఎన్నన్ = ఎంచి చూడగా; వారలు = వారు; ధర్మవేత్తలు = ధర్మము తెలిసిన వారు; అనుచున్ = అని; తలపబడరు = అనబడరు.

భావము:

“బ్రహ్మాండమైన పదవిని అధిష్ఠించిన మహారాజులు ఎటువంటి వారు వచ్చినా లేవనక్కరలే”దని చెప్పే పండితులను ధర్మవేత్తలు అనరు.