పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : బృహస్పతి తిరస్కారము

  •  
  •  
  •  

6-265-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱుఁగమిఁ జేసినట్టి గురుహేళన మంత నెఱింగి యింద్రుఁ డ
చ్చరుపడి భీతినొంది యతిచింతితుఁడై తలపోసి పల్కె "న
ప్పమపవిత్రు లోకనుతవ్యచరిత్ర విశేషు పాదపం
రుహముఁ బూజ చేయక యర్మముఁ జేసితి నల్పబుద్ధి నై.

టీకా:

ఎఱుగమిన్ = తెలియక; చేసిన = చేసిన; అట్టి = అటువంటి; గురు = గురువు; హేళనము = అవమానము; అంతన్ = అంతయును; ఎఱింగి = తెలిసికొని; ఇంద్రుడు = ఇంద్రుడు; అచ్చరుపడి = ఆశ్చర్యపోయి; భీతిన్ = భయమును; ఒంది = పొంది; అతి = మిక్కిలి; చింతితుడు = బాధపడువాడు; ఐ = అయ్యి; తలపోసి = ఆలోచించుకొని; పల్కెన్ = పలికెను; ఆ = ఆ; పరమ = మిక్కిలి; పవిత్రున్ = పుణ్యుని; లోక = లోకములచే; నుత = స్తుతింపబడెడి; భవ్య = దివ్యమైన; చరిత్ర = వర్తన; విశేషు = విశేషముగా గలవాని; పాద = పాదములు యనెడి; పంకరుహమున్ = పద్మములను; పూజన్ = సేవించుట; చేయక = చేయకుండగ; అకర్మము = తప్పుపని; చేసితిన్ = చేసితిని; అల్పబుద్ధిని = తెలివితక్కువవాడిని; ఐ = అయ్యి.

భావము:

తెలియక చేసిన గురుధిక్కారాన్ని తెలుసుకొన్న ఇంద్రుడు తాను చేసిన దానికి ఆశ్చర్యపడి, భయపడి, పశ్చాత్తాపం చెంది ఇలా అనుకున్నాడు “అయ్యో! పరమ పవిత్రుడు, లోకంచేత కొనియాడబడే భవ్య చరిత్రుడు అయిన గురుదేవుని గౌరవించి ఆయన పాదపద్మాలను పూజింపక ఉపేక్షించాను. అల్పబుద్ధినై చేయరాని కార్యం చేశాను.