పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : బృహస్పతి తిరస్కారము

  •  
  •  
  •  

6-259.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధ చారణ గంధర్వ జిహ్మగాది
సురులు మునులును రంభాది సుందరాంగు
లాడఁ బాడంగ వినుతి చేయంగఁ గొలువఁ
మ్రొక్క భద్రాసనంబున నుక్కుమీఱి.

టీకా:

అరయంగన్ = తరచి చూసినచో; యోగి = యోగులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివాడ; అద్భుతంబున్ = ఆశ్చర్యకరము; అయ్యెడున్ = అగుచున్నది; సురల = దేవతల; పై = మీదకి; ఏటి = ఎందుల; కి = కు; సురగురుండు = బృహస్పతి {సురగురుడు - సుర (దేవతల)కి గురుడు (గురువు), బృహస్పతి}; కోపించెన్ = కోపగించెను; ఈతండు = ఇతను; గురు = గురువు ననెడి; భావమున = భావముతో; దేవతల్ = దేవతల; కున్ = కి; ఏమి = ఏ విధమైన; ఆపదలన్ = ఆపదలను; తలగన్ = తోలగిపోవునట్లు; చేసెన్ = చేసెను; ఎఱిగింపుము = తెలుపుము; అనవుడు = అనగా; ఇంద్రుండు = ఇంద్రుడు; త్రిభువన = ముల్లోకములపైన; ఐశ్వర్య = అధికారపు; మదంబునన్ = గర్వమువలన; సత్ = మంచి; పథంబున్ = దారిని; కానక = చూడలేక; వసు = వసువుల; రుద్ర = రుద్రుల; గణములున్ = సమూహములును; ఆదిత్య = ఆదిత్యుల; మరుత్ = మరుత్తుల; అశ్విదేవా = అశ్వినీదేవతల; ఆది = మొదలగు; మండలములు = సమూహములును;
సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; గంధర్వ = గంధర్వులు; జిహ్మగ = సర్పములు {జిహ్మగము - వంకరగా పోవునది, సర్పములు}; ఆది = మొదలగువారును; సురలు = దేవతలు; మునులును = మునులును; రంభ = రంభ; ఆది = మొదలగు; సుందరాంగులు = స్త్రీలు {సుందరాంగులు - సుందర (అందమైన) అంగులు (దేహము గలవారు), స్త్రీలు}; ఆడన్ = నాట్యములు చేయుచుండగా; పాడంగ = గీతములు పాడుచుండగా; వినుతి = స్తోత్రము; చేయంగ = చేయుచుండగా; కొలువన్ = సేవించుచుండగా; మ్రొక్క = మొక్కుతుండగా; భద్రాసనంబునన్ = సింహాసనమున {భద్రాసనము - రాజు కూర్చొనెడి పీఠము, సింహాసనము}; ఉక్కు = శౌర్యము; మీఱి = అతిశయించి.

భావము:

“యోగీంద్రా! ఆశ్చర్యం! దేవ గురువైన బృహస్పతికి దేవతల మీద కోపం ఎందుకు వచ్చింది? ఆ తరువాత గురుభావంతో వారికి వచ్చిన ఆపదను ఏ విధంగా తొలగించాడు? నాకు వివరంగా చెప్పు” అని అడిగిన పరీక్షిత్తులు శుకమహర్షి ఇలా చెప్పాడు. “ఒకసారి ఇంద్రుడు ముల్లోకాలకు నేనే ప్రభువు నన్న అహంకారంతో సన్మార్గాన్ని అతిక్రమించాడు. వసువులు, రుద్ర గణాలు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినీదేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, నాగులు, దేవతలు, మునులు మొదలైన వారితో సింహాసనంపై కొలువు తీరాడు. రంభ మొదలైన సుందరాంగులు ఆడి, పాడి, ప్రశంసిస్తూ ఉన్నారు.