పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

6-7-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ రకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.

టీకా:

కాళి = పార్వతీదేవి; కిన్ = కి; బహుసన్నుతలోకాళి = పార్వతీదేవి {బహు సన్నుత లోకాళి - బహు (అనేకమైన) సన్నుత (స్తుతించెడి) లోక (లోకముల) ఆళి (సమూహములు గలామె), పార్వతి}; కిన్ = కు; కమనీయవలయకరకీలితకంకాళి = పార్వతీదేవి {కమనీయ వలయ కర కీలిత కంకాళి - కమనీయ (మనోహరమైన) వలయ (కంకణములు) కర (చేతు లందు) కీలిత (అలంకరింపబడిన) కంక (పుఱ్ఱెల) ఆళి (సమూహములు గలామె), పార్వతి}; కిన్ = కి; తాపసమానసకేళి = పార్వతీదేవి {తాపస మానస కేళి - తాపసుల మానస (మనసు లందు) కేళి (విహరించెడి యామె), పార్వతి}; వందనము = నమస్కారము; చేసి = చేసి; కీర్తింతున్ = స్తుతింతును; మదిన్ = మనసు నందు.

భావము:

లోకాలన్నిటి చేత పొగడబడేది, అందమైన కంకణాలు కలిగిన చేతిలో కపాలాన్ని ధరించేదీ. మునుల మనస్సులలో విహరించేది అయిన కాళీమాతను నా మనస్సులో కీర్తిస్తాను.