పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

6-6-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విసత్కంకణరవరవ
లితం బగు నభయ వరద రముల బెరయం
జెరేఁగి భక్తులకు నల
లుములు దయచేయు జలధిన్యకఁ దలతున్.

టీకా:

విలసత్ = ప్రకాశిస్తున్న; కంకణరవ = కంకణముల శబ్దముల; రవ = శబ్దముతో; కలితంబు = కూడినదైన; అభయ = అభయమును; వర = వరములను; ద = ఇచ్చెడి; కరములన్ = చేతులతో; పెరయన్ = ప్రకాశించుతూ; చెలరేగి = ఉత్సాహించి; భక్తుల్ = భక్తుల; కున్ = కు; అల = ఆ యొక్క; కలుములు = సంపదలు; దయచేయు = ఇచ్చెడి; జలధికన్యకన్ = లక్ష్మీదేవిని {జలధి కన్య - జలధి (సముద్రము) యొక్క కన్య (పుత్రిక), లక్ష్మి}; తలతున్ = సంస్మరించెదను.

భావము:

మెరిసే కంకణాలు గలగలలాడగా, అభయహస్తంతో భయం తీర్చి, వరదహస్తంతో కోరిన వరాలిచ్చి, భక్తులకు భాగ్యాలను ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన ఆ యొక్క లక్ష్మీదేవిని స్మరించుకొంటాను.