పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

6-12-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
మ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
మ్మెఱ పోతరాజుఁ గవిట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

టీకా:

ఎమ్మెలు = ప్రగల్భములు; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందులకు; జగము = లోకము; ఎన్నగన్ = కీర్తించగా; పన్నగరాజశాయి = నారాయణుని {పన్నగ రాజ శాయి - పన్నగరాజు (ఆదిశేషుని) శాయి (శయ్యగా కలవాడు), విష్ణువు}; కిన్ = కి; సొమ్ముగా = అలంకారమైన; వాక్య = మాట లనెడి; సంపదలు = సంపదలను; చూఱలుచేసినవానిన్ = కొల్లగొట్టిన వానిని; భక్తిన్ = భక్తిగా; లో = మనసులో; నమ్మినవాని = నమ్మినట్టి వానిని; భాగవత = భాగవతులలో; నైష్ఠికుడు = నిష్ఠాగరిష్ఠుడైన వాడు; ఐ = అయ్యి; తగువానిన్ = తగినవానిని; పేర్మితో = ఆదరముతో; బమ్మెఱ పోతరాజు = బమ్మెఱ పోతనను; కవి = కవులలో; పట్టపురాజున్ = పట్టాభిషిక్తుడైన రాజుని; తలంచి = సంస్మరించి; మ్రొక్కెదన్ = కొలిచెదను.

భావము:

ప్రగల్భాలు చెప్పడం ఎందుకు? జగమంతా మెచ్చగా శేషశయనుడైన విష్ణుదేవునికి తన కవితా సంపదలనే భూషణాలుగా కోకొల్లలుగా సమర్పించుకొన్నవాడు, భక్తినే నమ్మినవాడు, భగవత్పరమైన పరమ నిష్ఠా గరిష్ఠుడు (భాగవత రచనా నిష్ఠ కలవాడు), కవిరాజు అయిన బమ్మెర పోతనను తలచుకొని నమస్కరిస్తాను.