పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

6-11.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెయఁ దిక్కన సోమయాజు భజించి
యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చఁ గొల్చి
సుకవిసోముని నాచనసోమునెఱిఁగి
విమనోనాథు శ్రీనాథు నత మెచ్చి.

టీకా:

వర = ఉత్తమమైన; కవితా = కవిత్వము చెప్పు టందు; ఉద్రేకిన్ = ఉత్సాహము గలవాడైన; వాల్మీకిన్ = వాల్మీకిని {వాల్మీకి – రామాయణ కర్త}; కొనియాడి = కీర్తించి; భాగవత = భాగవతము యొక్క; అర్థ = అర్థమును, ప్రయోజనమును; వైభవమున్ = వైభవమును, గొప్పదనముల; పలుకు = పలికెడు; శుక = చిలుకవలె; మంజుల = మనోహరముగా; ఆలాపు = పలికెడు; శుక = శుకుడు యనెడి {శుకుడు – భాగవత పురాణ ప్రయోక్త}; యోగిన్ = యోగిని; ప్రార్థించి = కీర్తించి; బాణ = బాణుని {బాణుడు – హర్షచరిత్ర, చండికా శతకము, పార్వతీ పరిణయం మున్నగునవి వ్రాసిన హర్షవర్థనుని ఆస్థాన కవి}; మయూరులన్ = మయూరుల యొక్క {మయూరుడు – సంస్కృత సూర్యశతకం వ్రాసిన శ్రీహర్షుని ఆస్థాన కవి}; ప్రతిభన్ = ప్రజ్ఞను; నుడివి = పొగిడి; భాస = భాసుని {భాసుడు – ఊరుభంగం మున్నగు అద్భుత నాటకాలు వ్రాసిన గొప్ప సంస్కృత కవి}; సౌమల్లిక = సౌమల్లికుని {సౌమల్లికుడు – మహాకవి కాళిదాసు అంతనివానిచే సబహుమానంగా పేర్కొనబడిన అంతకు పూర్వకవి}; భారవి = భారవిని {భారవి – కిరాతార్జునీయం వ్రాసిన దక్షిణభారతదేసానికి చెందిన సంస్కృత మహాకవి}; మాఘులన్ = మాఘులను {మాఘుడు – శిశుపాలవధ వ్రాసిన గొప్ప సంస్కృత పండితుడు}; ఘన = గొప్ప; సుధా = అమృతమువంటి; మధుర = తీయని; వాక్యములన్ = మాటలతో; తలచి = సంస్మరించి; కాళిదాసున్ = కాళిదాసుని {కాళిదాసు – మేఘసందేశం, రఘువంశం, కుమారసంభవం మున్నగునవి వ్రాసిన మహా గొప్ప పండితుడు, ఇతనిని మించిన కవి లేడు}; కవి = కవులలో; ఇంద్ర = శ్రేష్ఠమైన; కల్పవృక్షమున్ = కల్పవృక్షము వంటివానిని; కొల్చి = పూజించి; నన్నపాచార్యు = నన్నయ యనెడి ఆచార్యుని {ఆది కవి నన్నయ – మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో ప్రథముడు}; వర్ణనలన్ = వర్ణనలను; పొగడి = కీర్తించి.
వెలయన్ = ప్రసిద్ధముగా; తిక్కన = తిక్కన యనెడి {తిక్కన - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండవవాడు}; సోమయాజులన్ = సోమయాజిని; భజించి = పూజించి; ఎఱ్ఱన = ఎఱ్ఱన {ఎఱ్ఱన - మహాభారతం ఆంధ్రీకరించిన కవిత్రయంలో మూడవవాడు }; ఆమాత్యున్ = మంత్రిని; భాస్కరున్ = భాస్కరుని {భాస్కరుడు – రామాయణం ఆంధ్రీకరించిన మహాకవి}; ఇచ్చన్ = ఇష్టపూర్తిగా; కొల్చి = పూజించి; సుకవి = మంచి కవి యైన; సోముని = సోముని; నాచనసోముని = నాచనసోముని {నాచన సోమన – ఉత్తర హరివంశం వ్రాసిన మహాకవి}; ఎఱిగి = తెలిసికొని; కవి = కవుల యొక్క; మనస్ = మనసులకు; నాథున్ = పతివంటి వాడైన; శ్రీనాథు = శ్రీనాథుని యొక్క {శ్రీనాథుడు – మరుత్తరాట్చరిత్ర, కాశీఖండము, హరవిలాసము మున్నగునవి వ్రాసిన ప్రౌఢకవి, వీరు పోతనకు మేనమామ అని నానుడి}; ఘనతన్ = గొప్పదనమును; మెచ్చి = శ్లాఘించి.

భావము:

ఉత్తమ కవితావేశం కలిగిన వాల్మీకిని కీర్తించి, భాగవత పరమార్థాన్ని చక్కగా వివరించి చెప్పిన శుకమహర్షిని ప్రార్థించి, బాణుడు మయూరుడు మొదలైన కవుల ప్రతిభను పొగడి, భాస సౌమిల్లక భారవి మాఘ కవుల సుధామధురోక్తులను స్మరించి, కవుల పాలిటి కల్పవృక్షమైన కాళిదాసును కొలిచి, నన్నపార్యుని వర్ణనలను పొగడి, తిక్కన సోమయాజిని కీర్తించి, ఎఱ్ఱన భాస్కర కవులను మెచ్చి, సుకవి అయిన నాచన సోమునికి నమస్కరించి, కవిజన మనోనాథుడైన శ్రీనాథుని గొపతనాన్ని మెచ్చుకొని...