పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

6-1-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

- ^
శ్రీత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.


కొన్ని ప్రతులందు “శా. శ్రీవత్సాంకిత..” పద్యమునకు మాఱుగా

“క.
భూదయాహృదయస్థిత
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతివి
ఖ్యా సురార్చితపదాబ్జ! రుణానిలయా!”
అని పద్యం ఉన్నది.
- తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి


టీకా:

శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీవిభ్రాజితున్ = శ్రీమన్నారాయణుని {శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీ చారు వక్షస్థల శ్రీవిభ్రాజితుడు – శ్రీవత్స మనెడి పుట్టుమచ్చ అంకిత (గుర్తుగాగలిగి) కౌస్తుభమణిచే స్ఫురిత (ప్రకాశిస్తున్న) లక్ష్మీదేవితోకూడిన చారు (అందమైన) వక్షస్థలసంపదచే విభ్రాజితుడు (విశేషముగా ప్రకాశించుచున్నవాడు), హరి}; నీలవర్ణున్ = శ్రీమన్నారాయణుని {నీలవర్ణుడు - నీలమైన రంగుగల దేహము గలవాడు, హరి}; శుభరాజీవాక్షున్ = శ్రీమన్నారాయణుని {శుభరాజీవాక్షుడు - శుభ (శుభప్రదమైన) రాజీవ (పద్మదళముల) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), హరి}; కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోద్దీప్తోరు రత్న ప్రభావ్యావిద్ధాంఘ్రి సరోజున్ = శ్రీమన్నారాయణుని {కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోద్దీ ప్తోరురత్న ప్రభావ్యావిద్ధాంఘ్రి సరోజుడు - కంజాతభూ (నీటపుట్టునట్టి పద్మమున జనించినవాడు, బ్రహ్మదేవుడు) దేవేంద్రుడు ఆది (మొదలగు) దేవమకుట (దేవతల కిరీటములందు) ఉద్దీప్త (మిక్కిలి ప్రకాశిస్తున్న) ఉరు (పెద్ద) రత్నముల ప్రభా (కాంతులు) వ్యావిద్ధ (విశేషముగా పరచబడిన) అంఘ్రి (పాదములనెడి) సరోజుడు (పద్మములుగలవాడు), హరి}; అచ్యుతున్ = శ్రీమన్నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, హరి}; కృపావాసున్ = శ్రీమన్నారాయణుని {కృపావాసుడు - కృప (దయ)కు ఆవాసుడు (నివాసమైనవాడు)}; ప్రశంసించెదన్ = స్తుతించెదను.

భావము:

శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ప్రకాశించేదీ లక్ష్మీదేవికి నెలవైనదీ అయిన వక్షఃస్థలంతో విరాజిల్లేవాడు, నీలవర్ణం కలిగినవాడు, శుభాలను చేకూర్చే పద్మాలవంటి కన్నులు కలవాడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల కిరీటాలలోని రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు అయిన శ్రీమన్నారాయణుని స్తుతిస్తాను.