పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పూర్ణి

  •  
  •  
  •  

5.2-168-గ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇది శ్రీ సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత మహాపురాణంబునందు భరతాత్మజుం డైన సుమతికి రాజ్యాభిషేకంబును, పాషండదర్శనంబును, సుమతి పుత్ర జన్మ విస్తారంబును, గయుని చరిత్రంబును, గయుని సంస్తుతియు, భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ సంస్థితియు నను కథలు గల పంచమస్కంధంబు నందు ద్వితీయాశ్వాసము సమాప్తము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = శుభకరమైన; సకల = సమస్తమైన; సు = మంచి; కవి = కవులైన; జన = వారికి; ఆనంద = ఆనందమును; కర = కలిగించెడి; బొప్పనామాత్య = బొప్పనామాత్యుని; పుత్ర = పుత్రుడు; గంగన = గంగన యనెడి; ఆర్య = ఉత్తమునిచే; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయినట్టి; శ్రీమత్ = శ్రీమంతమైన; భాగవత = భాగవతము యనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లోని; భరత = భరతుని యొక్క; ఆత్మజుండు = పుత్రుడు; ఐన = అయిన; సుమతి = సుమతి; కిన్ = కి; రాజ్య = రాజ్యాధికారమున; అభిషేకంబును = పట్టాభిషేకమును; పాషాండదర్శనంబును = పాషాండమత దర్శనము; సుమతి = సుమతి యొక్క; పుత్ర = పుత్రుల; జన్మ = జన్మములు; విస్తారంబును = విస్తరించుటలు; గయుని = గయుని యొక్క; చరిత్రంబును = చరిత్ర; గయుని = గయుని యొక్క; సంస్తుతియు = స్తుతులు; భూ = భూమండలము; ద్వీప = ద్వీపములు; వర్ష = వర్షములు; సరిత్ = నదులు; అద్రి = పర్వతములు; నభస్ = ఆకాశము; పాతాళ = పాతాళము; దిక్ = దిక్కులు; నరక = నరకములు; తారా = తారల; గణ = సమూహముల; సంస్థితియున్ = సుస్థిర స్థానములు; అను = అనెడి; కథలు = కథనములు; కల = కలిగిన; పంచమ = ఐదవ (5); స్కంధంబున్ = స్కంధము; అందున్ = లో; ద్వితీయ = రెండవ (2); ఆశ్వాసము = ఆశ్వాసము; సమాప్తము = సంపూర్ణము;

భావము:

ఇది సకల సుకవులకు ఆనందాన్ని కలిగించేవాడు, బొప్పనామాత్యుని పుత్రుడు అయిన గంగనార్యుని చేత రచింపబడ్డ శ్రీమద్భాగవత పురాణంలో భరతుని కుమారుడైన సుమతికి రాజ్య పట్టాభిషేకం, పాషండ దర్శనం, సుమతి పుత్రుల జననంతో వంశ విస్తారము, గయుని చరిత్ర, గయుడు చేసిన సంస్తుతి, భూమిమీది ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రాలు, పాతాళం, దిక్కులు, నరకాలు, నక్షత్రాలు మొదలైనవాటి స్థితిగతులు అనే కథలున్న పంచమస్కంధం యొక్క ద్వితీయాశ్వాసం సుసంపూర్ణం.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!