పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-160-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యింటికి వచ్చిన మను
జుని నతిథిం గ్రోధదృష్టిఁ జూచిన వానిం
నుఁగవల వజ్రదంష్ట్రలఁ
రిన యా కంక గృధ్రతి భక్షించున్.

టీకా:

తన = తన యొక్క; ఇంటి = నివాసమున; కిన్ = కు; వచ్చిన = వచ్చినట్టి; మనుజుని = మనిషిని; అతిథిన్ = అతిథిని; క్రోధ = క్రోధము కల; దృష్టిన్ = చూపులతో; చూచినన్ = చూసినచో; వానిన్ = వానిని; కను = కళ్ళ; గవలన్ = జంటను (2); వజ్ర = బహు గట్టి; దంష్ట్రలన్ = ముక్కులతో; తనరిన = అతిశయించిన; ఆ = ఆ; కంక = రాబందులు; గృధ = గద్ధల; తతి = గుంపు; భక్షించున్ = తినును;

భావము:

తన ఇంటికి వచ్చిన అతిథిని కోపంతో చూచినవాణ్ణి వజ్రాల కోరలు గలిగిన రాబందులు, గ్రద్దలు పొడుచుకొని తింటాయి.