పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-159-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయ దొడ్డిలోన నిండ్లలో నైనను
శు పతంగ హరిణ పంక్తి నెల్లఁ
ట్టి హింసజేయు పాపాత్ము విషవహ్ని
ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల!

టీకా:

ఎనయన్ = సరిపోలెడి; దొడ్డి = పెరడుల; లోనన్ = లోపల; ఇండ్ల = నివాసముల; లోనన్ = లోపల; ఐననున్ = అయినా; పశు = పశువులను; పతంగ = పక్షులను; హరిణ = లేళ్ళను; పంక్తిన్ = వరుసగా; ఎల్లన్ = అన్నిటిని; పట్టి = పట్టుకొని; హింస = బాధ; చేయు = పెట్టెడి; పాపాత్మున్ = పాపిష్టివానిని; విష = విషములు; వహ్ని = అగ్ని; ధూమ = పొగ; శిఖలన్ = కీలలో; ద్రొబ్బుదురు = తోయుదురు; నృపాల = రాజా;

భావము:

రాజా! తమ పెరళ్ళలో కాని, ఇండ్లలో కాని తిరిగే పశువులను, పక్షులను, లేళ్ళను హింసించే పాపాత్ములను విషాగ్ని జ్వాలలలో త్రోస్తారు.