పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-152-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుకములఁ బెంచి యెవ్వం
యంబును వేఁట సలిపి యాత్మార్థముగా
మృగములఁ జంపును నా
నుజాధము నస్త్రములను ర్దింతు రొగిన్.

టీకా:

శునకములన్ = కుక్కలను; పెంచి = పెంచుతూ; ఎవ్వండు = ఎవరు; అనయంబున్ = ఎల్లప్పుడు, అస్తమాను; వేట = వేటాడుట; సలిపి = చేసి; ఆత్మ = తన; అర్థముగాన్ = కోసమై; వన = అడవి; మృగములన్ = జంతువులను; చంపును = సంహరించునో; ఆ = ఆ; మనుజ = మానవులలో; అధమున్ = అధముని; అస్త్రములన్ = అస్త్రములతో; మర్దింతురు = చితకగొట్టుదురు; ఒగిన్ = శీఘ్రమే;

భావము:

వేటకుక్కలను పెంచి ఎల్లప్పుడు వేటకు పోతూ తన తిండి కోసం అడవిలోని మృగాలను చంపిన నీచ మానవుని యమభటులు అస్త్రాలతో పొడుస్తారు.