పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-147-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రిమిభోజన మనియెడి నర
మునం బడి క్రిములె కూడుగాఁ గుడుచుచుఁ దాఁ
గ్రిమి యగుచు లక్ష పరిమా
ముఁ గల క్రిమిగుండ మందు నాఁటుక యుండున్.

టీకా:

క్రిమిభోజనము = క్రిమిభోజనము; అనియెడి = అనెడి; నరకమునన్ = నరకములో; పడి = పడిపోయి; క్రిములె = క్రిములనె; కూడుగాన్ = భోజనముగా; కుడుచుచున్ = తినుచు; తాన్ = తనే; క్రిమి = క్రిమిగా; అగుచున్ = అగుచు; లక్ష = లక్ష (1,00,000); పరిమాణము = యోజనముల కొలతలు; కల = కలిగిన; క్రిమిగుండము = క్రిములు కల గోతి; అందున్ = లోకి; నాటుకన్ = కూరుకుపోయి; ఉండున్ = ఉండును;

భావము:

క్రిమిభోజనం అనే నరకంలో పురుగుగా పడి లక్ష యోజనాల విస్తీర్ణం కల పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులను ఆహారంగా తింటూ ఉంటాడు.