పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-92-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిసప్తకమున కెగువం
రుచు నా మీఁదఁ ద్రియుతశలక్షలఁ బెం
పు శింశుమారచక్రం
నఁగా నిన్నిఁటికి నుపరి గుచుండు నృపా!

టీకా:

మునిసప్తకమున్ = సప్తర్షిమండలమున; కిన్ = కి; ఎగువన్ = పైన; తనరుచున్ = అతిశయించుతూ; ఆ = ఆ; మీద = పైన; త్రియుతదశలక్షల = పదమూడులక్షల (13,00,000); పెంపునన్ = ఎత్తున; = శింశుమారచక్రంబున్ = శింశుమారచక్రము {శింశుమారము - మొసలి}; అనగాన్ = అనగా; ఇన్నిటికిన్ = అన్నిటికి; ఉపరి = పైనున్నది; అగుచుండున్ = అయ్యి ఉండును; నృపా = రాజా;

భావము:

రాజా! సప్తర్షి మండలం కంటె పదమూడు లక్షల యోజనాల దూరంలో శింశుమారచక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికన్న పైన ఉన్న చక్రం.