పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-89-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రణీతనూజుఁ డంటిమీఁద రెండుల-
క్షల నుండి మూఁడు పక్షముల నొక్క
రాశి దాఁటుచు నుండుఁ; గ్రమమున ద్వాదశ-
రాసుల భుజియించు రాజసమున;
క్రించియైన నక్రత నైనను-
ఱచుగాఁ బీడలు రుల కొసఁగు;
నంగారకుని టెంకి కావల రెండుల-
క్షల యోజనంబుల నత మించి

5.2-89.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యొక్క రాశినుండి యొక్కొక్క వత్సరం
నుభవించుచుండు మరగురుఁడు
క్రమందు నైన సుధామరులకును
శుము నొసఁగు నెపుడు భినవముగ.

టీకా:

ధరణీతనూజుడు = అంగారకుడు {ధరణీతనూజుడు - ధరణీ (భూమికి) తనూజుడు (పుత్రుడు), అంగారకుడు}; రెండులక్షలన్ = రెండులక్షల (2,00,000) ఎత్తులో; ఉండి = ఉండి; మూడు = మూడు (3); పక్షములన్ = పక్షములకు; ఒక్క = ఒక; రాశిన్ = రాశిని; దాటుచున్ = కడచుచు; ఉండున్ = ఉండును; క్రమమున = వరుసగా; ద్వాదశ = పన్నెండు (12); రాసుల = రాశుల; భుజియించు = అనుభవించును; రాజసమున = రజోగుణముతో; వక్రించి = వక్రగతియందు; ఐనన్ = అయినను; అవక్రతన్ = వక్రగతిలేకుండగ; ఐననున్ = అయినను; తఱచుగా = బహుళముగా; పీడలు = చీడపీడలు; నరుల్ = జనుల; కున్ = కు; ఒసగున్ = ఇచ్చును; అంగారకుని = అంగారకుని; టెంకి = నివాసమున; కిన్ = కి; ఆవల = అవతల; రెండులక్షల = రెండులక్షల (2,00,000); యోజనంబులన్ = యోజనముల దూరములో; ఘనతన్ = గొప్పగా; మించి = అతిశయించి;
ఒక్క = ఒక్కక్క; రాశిన్ = రాశిలోను; ఉండి = ఉండి; ఒక్కక్క = ఒక్కక్క; వత్సరంబున్ = సంవత్సరము; అనుభవించుచుండున్ = అనుభవించుతుండును; అమరగురుడు = బృహస్పతి {అమరగురుడు - అమరుల (దేవతల) కు గురువు, బృహస్పతి}; = వక్రమందున్ = వక్రగతిలోనుండి; ఐనన్ = అయినను; వసుధామరుల్ = బ్రాహ్మణుల {వసుధామరలు - వసుధ (భూమి)కి అమరులు (దేవతలు), బ్రాహ్మణులు}; కునున్ = కి; శుభమున్ = శుభములను; ఒసగున్ = ఇచ్చును; ఎపుడున్ = ఎల్లప్పుడును; అభినవముగ = కొత్తకొత్తగ;

భావము:

బుధునికంటే పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడు పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఈ విధంగా పన్నెండు రాసులలో రాజసంతో సంచరిస్తూ ఉంటాడు. వక్రగతిలో కాని, వక్రగతిలో లేనప్పుడు కాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అతడు ప్రతి ఒక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం సంచరిస్తూ ఉంటాడు. ఇతడు వక్రగతిలో ఉన్నా బ్రాహ్మణులకు ఎప్పటి కప్పుడు శుభపరంపరలను ప్రసాదిస్తూ ఉంటాడు.