పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-88-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట మీఁదఁ దారల న్నిటి కుపరి యై-
రెండులక్షల శుక్రుఁ డుండి భాస్క
రుని ముందఱం బిఱుఁను సామ్యమృదు శీఘ్ర-
సంచారములను భాస్కరుని మాడ్కిఁ
రియించుచుండును నులకు ననుకూలుఁ-
డై వృష్టి నొసఁగుచు నంతనంతఁ
తురత వృష్టి విష్కంభక గ్రహశాంతి-
నొనరించువారల కొసఁగు శుభము;

5.2-88.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుండు నా మీఁద సౌమ్యుండు రెండులక్ష
ను జరించుచు రవిమండలంబుఁ బాసి
కానఁబడినను జనులకు క్షామ డాంబ
రాది భయములఁ బుట్టించు తుల మహిమ

టీకా:

అట = అక్కడనుండి; తారల్ = తారలు; కున్ = కు; అన్నిటి = అన్నిటి; కిన్ = కి; ఉపరి = పైనున్నది; ఐ = అయ్యి; రెండులక్షల = రెండులక్షల (2,00,000) ఎత్తులో; శుక్రుడు = శుక్రగ్రహము; ఉండి = ఉండి; భాస్కరుని = సూర్యుని; ముందఱన్ = రాకకు ముందర; పిఱుందను = వెనుక; సామ్య = సామానముగ; మృదు = మెల్లగా; శీఘ్ర = వేగముగ; సంచారములను = తిరుగుటలను; భాస్కరుని = సూర్యుని; మాడ్కిన్ = వలె; చరియించుచుండును = వర్తించుచుండును; జనుల్ = ప్రజల; కున్ = కు; అనుకూలుడు = అనుకూలముగ నుండువాడు; ఐ = అయ్యి; వృష్టిన్ = వర్షమును; ఒసగుచున్ = కలిగించుచు; అంతనంతన్ = అప్పుడప్పుడు; చతురతన్ = నేర్పుగా; వృష్టి = వర్షమునకు; విష్కంభక = విఘ్నములకై; గ్రహశాంతి = గ్రహములకు శాంతికర్మలు; ఒనరించు = చేసెడి; వారల = వారి; కిన్ = కి; ఒసగున్ = ఇచ్చును; శుభములు = శుభములను; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మీద = పైన;
సౌమ్యుండు = బుధుడు {సౌమ్యండు - సోముని (చంద్రుని) పుత్రుడు, బుధుడు}; రెండులక్షలను = రెండులక్షల (2,00,000) ఎత్తులో; చరించుచున్ = సంచరించుచు; రవి = సూర్య; మండలంబున్ = మండలమును; పాసి = విడిచి; కానబడినను = కనపడుతున్నప్పటికిని; జనుల్ = ప్రజల; కున్ = కి; క్షామ = కరువులు; ఆడంబర = యుద్ధసన్నాహాలు; ఆది = మొదలగు; భయములన్ = భయములను; పుట్టించు = కలిగించును; అతుల = సాటిలేని; మహిమన్ = మహిమతోటి;

భావము:

నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఇతడు సూర్యునికి ముందూ, వెనుకా ఉదయిస్తూ సూర్యునిలాగే సంచారం చేస్తాడు. ఇతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు తొందరగా సాగుతుంది. ఈ శుక్రుడు ప్రజల కందరికీ అనుకూలుడై వర్షం కురుపిస్తాడు. వర్షాలకు ఆటకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రుని కంటె పైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు తిరుగుతూ ఉంటాడు. అతడు సూర్యమండలాన్ని వదలి దూరంగా కనిపించినా ప్రజలందరికీ కరువు కాటకాలు, దోపిడీల భయాన్ని కలిగిస్తాడు.