పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-84-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునివర! మేరుధ్రువులకు
నొరఁ బ్రదక్షిణము దిరుగుచుండెడు నజుఁ డా
యినుఁ డభిముఖుఁడై రాసుల
నుకూలత నేగు నంటి; ది యెట్లొప్పున్."

టీకా:

ముని = మునులలో; వర = ఉత్తముడ; మేరు = మేరువునకు; ధ్రువులు = ధ్రువమండలముల; కున్ = కు; ఒనరన్ = చక్కగా; ప్రదక్షిణము = చుట్టును; తిరుగుచుండెడున్ = తిరుగుతుండెడి; అజుడు = పుట్టుక లేనివాడు; ఆ = ఆ; = ఇనుడు = సూర్యుడు; అభిముఖుడు = ఎదురుగ తిరుగువాడు; ఐ = అయ్యి; రాసులన్ = రాశుల; కున్ = కు; అనుకూలతన్ = అనుకూలముగ; ఏగును = ప్రయాణించును; అంటివి = చెప్పితివి; అది = అది; ఎట్లు = ఏవిధముగ; ఒప్పున్ = జరుగును;

భావము:

“మునీంద్రా! సూర్యుడు మేరువుకు, ధ్రువునికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడని చెప్పావు కదా! బ్రహ్మ స్వరూపుడైన సూర్యుడు పన్నెండు రాసులలోను అభిముఖుడై తిరిగుతాడని కూడా అన్నావు. అది ఎలా పొసగుతుంది?”