పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-79-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేషతులల యందు మిహిరుం డహోరాత్ర
మందుఁ దిరుగు సమవిహారములను;
రఁగఁగ వృషభాది పంచరాసులను నొ
క్కొక్క గడియ రాత్రి క్కి నడచు.

టీకా:

మేష = మేషరాశి; తులల = తులారాశుల; అందున్ = లో; మిహిరుండు = సూర్యుండు; అహోరాత్రము = రాత్రింబవళ్లు; అందున్ = అందును; తిరుగున్ = తిరుగును; సమ = సమానమైన; విహారములనున్ = నడకలతోను; పరగగన్ = ప్రసిద్ధముగ; వృషభ = వృషభమురాశి; ఆది = మొదలగు రాశులు; పంచ = ఐదింట తిరిగెడు; మాసములున్ = మాసము లందు; ఒక్కొక్క = ఒకటి చొప్పున; గడియ = గడియ; రాత్రి = రాత్రిసమయము; తగ్గి = తగ్గుతూ; నడచున్ = నడచును;

భావము:

మేషరాశిలో, తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాసులలో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి తగ్గుతూ వస్తుంది.