పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-78-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భాస్కరుం డుత్తరాయణ దక్షిణాయన విషువు లను నామంబులు గల మాంద్య తీవ్ర సమానగతుల నారోహణావరోహణ స్థానంబుల యందు దీర్ఘ హ్రస్వ సమానంబులుగాఁ జేయుచుండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భాస్కరుండు = సూర్యుడు; ఉత్తరాయణ = ఉత్తరాయణము; దక్షిణాయన = దక్షిణాయనము; విషువులున్ = విషువులు {విషువు - పగలు రాత్రి సమానముగ నుండు దినములు, (1)మార్చి21న వచ్చెడి ఉత్తర (వసంత) విషువు మొదటిది, (2)సెప్టంబరు 21న వచ్చెడి దక్షిణ (శరత్) విషువు రెండవది}; అను = అనెడి; నామంబులున్ = అనెడి పేర్లు; కల = కలిగిన; మాంద్య = మెల్లని; తీవ్ర = వేగవంతమైన; సమాన = సమానమైన; గతులన్ = నడకలతో; ఆరోహణ = పైకెక్కెడి; అవరోహణ = కిందకు దిగెడి; స్థానంబులన్ = స్థానములు; అందున్ = లోను; దీర్ఘ = పెద్దది; హ్రస్వ = చిన్నవి; సమానంబులుగా = మానమైనవిగా; చేయుచుండున్ = కలుగ జేయును;

భావము:

అటువంటి సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆ గమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ మూడు గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ, సమస్థానాలలో రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానాలుగా మారుతూ ఉంటాయి.