పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : గయుని చరిత్రంబు

  •  
  •  
  •  

5.2-9-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ర్మమార్గంబున ధారుణీజనులను-
బ్రేమతోఁ బోషణ ప్రేషణోప
లాలనశాసనక్షణాదులచేతఁ-
బోషించుచును యజ్ఞములను యజ్ఞ
పురుషు నీశ్వరుఁ జిత్తమున నిల్పి సేవించి-
స్వాంతమందున్న యీశ్వరునిఁ గాంచి
ఖిల జీవతతికి నానంద మొసఁగుచు-
నిభిమానతమెయి ణి నేలె

5.2-9.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్యమందు మిగులు త్సేవయందును
ర్మమందు యజ్ఞర్మమందు
యుఁడు వసుధలోనఁ గంజాక్షుఁడే కాని
మానవుండు గాఁడు మానవేంద్ర!

టీకా:

ధర్మమార్గంబునన్ = ధర్మబద్ధమైనవిధముగ; ధారుణీ = భూలోకపు; జనులను = ప్రజలను; ప్రేమ = ప్రేమ; తోన్ = తోటి; పోషణ = పోషించు; ప్రేషణ = నియమించు; ఉపలాలన = బుజ్జగించు; = శాసన = పరిపాలించు; లక్షణ = లక్షణములు; ఆదుల్ = మొదలగువాని; చేతన్ = చేత; పోషించుచును = పోషించుతూ; యజ్ఞములను = యజ్ఞములవలన; యజ్ఞపురుషున్ = హరిని; ఈశ్వరున్ = భగవంతుని; చిత్తమునన్ = మనసులో; నిల్పి = నిలుపుకొని; సేవించి = సేవచేసుకొని; స్వాంతము = తనయందు; ఉన్న = ఉన్నట్టి; ఈశ్వరునిన్ = భగవంతుని; కాంచి = దర్శించి; అఖిల = నిఖిలమైన; జీవ = ప్రాణుల; తతి = సమూహమున; కిన్ = కి; ఆనందమున్ = ఆనందమును; ఒసగుచు = ఇస్తూ; నిరభిమానతన్ = స్వాభిమానములేకుండట; మెయి = తోటి; ధరణిన్ = భూమిని; ఏలెన్ = పాలించెను;
సత్యమున్ = సత్యము; అందున్ = లోను; మిగులన్ = మిక్కిలిగ; సత్ = నిజమైన; సేవన్ = సేవ; అందునున్ = లోను; ధర్మము = ధర్మము; అందున్ = లోను; యజ్ఞకర్మము = యజ్ఞముచేయుట; అందున్ = లోను; గయుడు = గయుడు; వసుధ = భూలోకము; లోనన్ = లో యున్న; కంజాక్షుడే = నారాయణుడే {కంజాక్షుడు - కంజము (పద్మముల)వంటి అక్షుడు (కన్నులుగల వాడు), విష్ణువు}; కాని = కాని; మానవుండు = మామూలు మనిషి; కాడు = కాడు; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకి ఇంద్రునివంటి వాడు, రాజు};

భావము:

“రాజా! గయుడు ధర్మమార్గానుసారంగా ప్రజలను ప్రేమతో పోషించడం, సత్కర్మలలో నియమించడం, బుజ్జగించడం, శాసించడం మొదలైన లక్షణాలతో పరిపాలించాడు. యజ్ఞాలు చేస్తున్నపుడు తన మనస్సులో యజ్ఞపురుషుడైన ఈశ్వరుణ్ణి నిలుపుకొని సేవించాడు. తన మనస్సులో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శిస్తూ, సకల జీవరాశికి ఆనందం కలిగిస్తూ స్వాభిమానం లేకుండా రాజ్యాన్ని పాలించాడు. సత్య విషయంలో, మంచివారిని సేవించడంలో, ధర్మరక్షణలో, యజ్ఞకర్మలు చేయడంలో గయుడు విష్ణుస్వరూపుడే కాని మానవమాత్రుడు కాడు.