పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : గయుని చరిత్రంబు

  •  
  •  
  •  

5.2-7-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి గయునివలన ఖిలజీవులఁ బ్రోవఁ
లఁచి సాత్వికప్రధాన మయిన
ట్టి మేను దాల్చి యాత్మతత్త్వజ్ఞానుఁ
గుచు నుండె హరి నిజాంశమునను.

టీకా:

అట్టి = అటువంటి; గయునిన్ = గయుని; వలనన్ = ద్వారా; అఖిల = సమస్తమైన; జీవులన్ = ప్రాణులను; ప్రోవన్ = కాపాడవలెనని; తలచి = భావించి; సాత్విక = సాత్వికగుణము; ప్రధానము = ముఖ్యమైన లక్షణముగ కలది; అయిన = ఐన; అట్టి = అటువంటి; మేనున్ = దేహమును; తాల్చి = ధరించి; ఆత్మతత్త్వ = ఆత్మత్త్వము యొక్క; జ్ఞానుండు = జ్ఞానము గలవాడు; అగుచున్ = అయ్యి; ఉండెన్ = ఉండెను; హరి = విష్ణుమూర్తి; నిజ = తన యొక్క; అంశమునను = అంశతో;

భావము:

అటువంటి గయుని చేత సమస్త జీవులను రక్షించాలని తలచాడు విష్ణువు. అందుకే సత్త్వ ప్రధానమైన దేహాన్ని ధరించి, ఆత్మతత్త్వం తెలిసినవాడుగా తన అంశతో గయుని రూపంలో అవతరించాడు.