పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-77-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెఱఁగుఁ దెలిసి భూసుర
జాతిం బూజించునట్టి నుఁడును మాయా
తీతుండై నిక్కంబుగ
భూలమున మోక్షమార్గమును బొడగాంచున్.

టీకా:

ఈ = ఆ; తెఱగున్ = విధమును; తెలిసి = తెలిసికొని; భూసురజాతిన్ = బ్రాహ్మణజాతిని; పూజించు = పూజించెడి; అట్టి = అటువంటి; జనుడును = మానవుడు; మాయా = మాయ యొక్క ప్రభావమునకు; అతీతుండు = అతీతమైనవాడు; ఐ = అయ్యి; నిక్కంబుగన్ = నిజముగ; భూతలమునన్ = భూమండలముపైన; మోక్ష = ముక్తి; మార్గమును = దారిని; పొడగాంచున్ = దర్శించగలుగును.

భావము:

ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను పూజించే మానవుడు మాయాతీతుడై భూలోకంలోనే మోక్షానికి మార్గాన్ని తెలుసుకుంటాడు.