పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-76.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందుచుండును నాదు దేహంబు గాఁగ
నెఱిఁగి వరులగు విప్రుల నెల్ల భక్తిఁ
బూజ చేయుటయే నన్నుఁ బూజ చేయు
నుచు వినిపించి మఱియు నిట్లనుచుఁ బలికె.

టీకా:

మంగళంబున్ = శుభకరమైనది; ఐన = అయిన; బ్రహ్మ = పరబ్రహ్మ; స్వరూపంబును = స్వరూపము; వేద = వేదముల; రూపంబున్ = స్వరూపము; అనాది = మొదలులోనిది; రూపమున్ = స్వరూపమును; అగుచున్ = అగుచున్న; నాదు = నా యొక్క; దేహమున్ = శరీరము; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; ఉత్తముల్ = ఉత్తములు; ధరియింతురు = ధరించెదరు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తత్త్వబుద్ధిన్ = తత్త్వస్వరూపమును తెలియు బుద్ధితో; శమ = శాంతి; దమ = నిగ్రహము; అనుగ్రహ = దయచూపుట; సత్య = సత్యము; తపస్ = తపస్సు; తితిక్ష = ఓర్పు; కల్గు = కలిగిన; విప్రుండు = బ్రాహ్మణుడు; సత్ = సత్యమైన; గురుండు = గురువు; కానన్ = కావున; మిక్కిలి = అదికమైన; భక్తి = భక్తి; కల్గి = కలిగి; అకించనులు = దరిద్రుడు; ఐనన్ = అయినను; భూసురుల = బ్రాహ్మణుల; దేహమున్ = శరీరము; వలన = వలన; అందుచుండును = అందుతూనుండును.
నాదు = నా యొక్క; దేహంబున్ = శరీరము; కాగ = అగునట్లు; ఎఱిగి = తెలిసి; వరులు = శ్రేష్ఠులు; అగు = అయిన; విప్రులన్ = బ్రాహ్మణులను; ఎల్లన్ = అందరను; భక్తిన్ = భక్తితో; పూజచేయుటయే = పూజించుటే; నన్నున్ = నన్ను; పూజచేయుట = పూజించుట; అనుచున్ = అనుచూ; వినిపించి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అనుచూ; పలికె = పలికెను.

భావము:

నా దేహం శుభప్రదమైన పరబ్రహ్మ స్వరూపం, వేదమయం. దీనికి ఆది లేదు. అలాంటి వేదమయమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్త్వగుణం కలిగినవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వి, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులు, మహానుభావులు అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తూ ఉంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకొని పూజ చేయడం నన్ను పూజ చేయడమే అవుతుంది” అని మళ్ళీ ఇలా అన్నాడు.