పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-75-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూసురులకు సరి దైవం
బీ చరాచరమునందు నెఱుఁగను; నాకున్
భూసురులు గుడుచు నప్పటి
యా సంతోషంబు దోఁప గ్నులయందున్.

టీకా:

భూసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; సరి = సాటి; దైవంబున్ = దైవమును; ఈ = ఈ; సచరాచరమున్ = ప్రపంచము {సచరాచరము - స (కలిసి యున్న) చర (కదలికగలవి) అచర (కదలికలేనివి) కలది, ప్రపంచ మంతయు}; అందున్ = లోను; ఎఱుగను = తెలియదు; నా = నా; కున్ = కు; భూసురుల్ = బ్రాహ్మణులు; కుడుచున్ = భుంజించెడి; అప్పటి = ఆ సమయము నందలి; ఆ = ఆ; సంతోషంబున్ = సంతోషము; తోపదున్ = తోచదు; అగ్నులన్ = అగ్నిహోత్రమున సమర్పించుట; అందున్ = అందు.

భావము:

ఈ చరాచర ప్రపంచంలో బ్రాహ్మణులకు సాటి అయిన దైవాన్ని నేనెరుగను. బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే నాకు కలిగే సంతోషం విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సు వల్ల కలుగదు.