పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-74.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డంతకన్నను భర్గుఁ డా భవు కన్నఁ
మలభఁవుఁ డెక్కుఁ; డాతని కంటె విష్ణుఁ
ధికుఁ; డాతఁడు విప్రుల నాదరించుఁ
గాన విప్రుండు దైవంబు మానవులకు.

టీకా:

భూత = ప్రాణి; జాలము = కోట్ల; అందున్ = లో; భూజముల్ = చెట్లు {భూజము - భూమి యందు జము (పుట్టినది), చెట్టు}; వర్యముల్ = ఉత్తమములు; భూరుహముల్ = చెట్ల {భూరుహము - భూమి యందు పుట్టినది, చెట్టు}; కంటెన్ = కంటె; భోగి = సర్పము, సుఖదుఃఖములు అనుభవించెడి జీవుల; కులము = సమూహములు; భోగి = భోగుల; సంతతి = కులము; కన్నన్ = కంటె; బోధనిష్ఠులు = తెలివిగలవారు; బోధమాన్యులు = తెలివిగలవారు; కన్నను = కంటె; మనుజవరులు = రాజులు; వీరి = వీరి; కన్నను = కంటె; సిద్ధ = సిద్ధులు; విబుధ = జ్ఞానులు; గంధర్వులు = గంధర్వులు; వారి = వాళ్ళ; కన్నను = కంటెను; సురల్ = వేల్పులు {సురలు - కొల్చువారి కోరికలు మెండుగా ఒసగు వారు, వేల్పులు}; వారి = వారి; కన్నన్ = కంటె; ఇంద్ర = ఇంద్రుడు {ఇంద్రుడు - ఇంద్రియములకు అధిపతి, దేవేంద్రుడు}; ఆది = మొదలగు; దేవతలున్ = ఇంద్రియాధిదేవతలు; ఇందఱి = వీరందరి; కన్నను = కంటెను; దక్ష = దక్షుడు; ఆది = మొదలగు; సత్ = సత్యమైన; మునుల్ = మునులు; తలపన్ = ఆలోచించిచూసిన; ఎక్కుడు = ఎక్కువ; అంతకన్నను = అంతకంటె.
భర్గుడు = శివుడు {భర్గుడు - భరించువాడు, శివుడు}; ఆ = ఆ; అభవున్ = శివుని {అభవుడు - భవము (పుట్టుక) లేనివాడు, శివుడు}; కన్నన్ = కంటె; కమలభవుడున్ = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - కమలమున సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఎక్కుడు = ఎక్కువ; ఆతని = అతని; కంటెన్ = కంటె; విష్ణుడు = విష్ణుమూర్తి; అధికుడు = గొప్పవాడు; ఆతడు = అతడు; విప్రులన్ = బ్రాహ్మణులను; ఆదరించున్ = గౌరవించును; కానన్ = కావున; విప్రుండు = బ్రాహ్మణుడు; దైవంబున్ = దైవము; మానవుల = మనుష్యుల {మానవులు - మనువు నుండి పుట్టినవారు, మనుష్యులు}; కును = కు.

భావము:

సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. వృక్షాలకంటె సర్పాలు శ్రేష్ఠాలు. సర్పాలకంటె మేధావులు ఉత్తములు. వారికంటె రాజులు గొప్పవారు. రాజులకంటె సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. కొల్చు వారి కోరికలు మెండుగా తీర్చు వారైన సురలను వేల్పులు గొప్పవారు. వారికంటెను ఇంద్రుడు మున్నగు ఇంద్రియాది అధిదేవతలు గొప్పవారు. వారికంటె దక్షుడు మొదలైన మునులు గొప్పవారు. వారికంటె రుద్రుడు, రుద్రునికంటె బ్రహ్మ, బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణువు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం.