పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-72-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నులెల్ల నర్థ వాంలఁ జేసి యత్యంత;
మూఢులై యైహికంబులు మనంబు
లందును గోరుదు; ల్ప సౌఖ్యములకు-
న్యోన్యవైరంబు లంది దుఃఖ
ములఁ బొందుదురు; గాన మునుకొని గురుఁ డైన-
వాఁడు మాయామోహశుఁడు నెంత
డుఁడు నైనట్టి యా జంతువునందును-
య గల్గి మిక్కిలి ర్మబుద్ధిఁ

5.1-72.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్ను లున్నవాఁడు గానని వానికి
దెరువుఁ జూపి నట్లు దెలియఁ బలికి
తుల మగుచు దివ్యమైన యా మోక్ష మా
ర్గంబుఁ జూప వలయు మణతోడ.

టీకా:

జనులు = ప్రజలు; ఎల్లన్ = అందరు; అర్థ = ప్రయోజనములందలి; వాంఛలన్ = కోరికల; చేసి = వలన; అత్యంత = మిక్కిలి; మూఢులు = మూర్ఖులు; ఐ = అయ్యి; ఐహికంబులు = ఇహలోకపు ప్రయోజనములు; మనంబునన్ = మనసులు; అందునున్ = లలో; కోరుదురు = ఆశించెదరు; అల్ప = నీచమైన; సౌఖ్యముల్ = సుఖకరముల; కున్ = కొరకు; అన్యోన్య = వారిలోవారికి; వైరంబున్ = శత్రుత్వమును; అంది = చెంది; దుఃఖములన్ = దుఃఖములను; పొందుదురు = పొందుతారు; కాన = కావున; మునుకొని = పూనుకొని; గురుడున్ = గురువు; ఐన = అయిన; వాడు = వాడు; మాయా = మాయవలన; మోహ = మోహమునకు; వశుడున్ = లొంగిపోయినవాడూ; జడుడున్ = తెలివితక్కువవాడూ; ఐనట్టి = అయినటువంటి; ఆ = ఆ; జంతువున్ = పశుప్రాయుని; అందునున్ = ఎడల; దయ = కృప; కల్గి = కలిగి; మిక్కిలి = అధికమైన; ధర్మబుద్ధిన్ = ధర్మబుద్ధితో; కన్నులు = కళ్ళు; ఉన్నవాడు = కలవాడు; కాననివాని = అంధుని; కిన్ = కి; తెరువున్ = దారి; చూపినట్లు = చూపెడి విధముగా; తెలియన్ = తెలిసేటట్లు; పలికి = చెప్పి.
= = అతులము = సాటిలేనిది; అగుచున్ = అగుచూ; దివ్యము = దివ్యము; ఐన = అయిన; ఆ = ఆ; మోక్ష = ముక్తిని చెందించు; మార్గంబున్ = దారిని; చూపవలయున్ = చూపించవలెను; రమణ = ప్రీతి; తోడన్ = తోటి.

భావము:

ప్రజలంతా ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూర్ఖులై ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలను కోరుతూ ఉంటారు. అల్పసుఖం కోసం ఒకరిపై మరొకకు వైరం పెంచుకుంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయా మోహాలకు లోబడిన మూర్ఖులైన జీవుల పట్ల సానుభూతి చూపాలి. కళ్ళున్నవాడు గ్రుడ్డివానికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటి లేనిది, దివ్యమైనది అయిన మోక్షానికి మార్గం చూపాలి.