పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-68-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులకు నే తపంబు నననంత సుఖంబులు గల్గుచుండు, శ్రీ
మతి నా తపంబుఁ దగఁ గైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం
దిముగఁ గల్గు; వృద్ధులను దీనులఁ బ్రోవుఁడు; దుష్ట వర్తనన్
రుగుచునుండు కాముకుల సంగతిఁ బోకుఁడు; మీఁద మేలగున్.

టీకా:

నరుల్ = మానవుల; కున్ = కు; ఏ = ఏ విధమైన; తపంబునన్ = తపస్సుతో; అనంత = అనంతమైన, అత్యధికమైన; సుఖంబులున్ = సుఖములు; కల్గుచుండున్ = కలుగుతూ యుండును; శ్రీ = శుభ; కర = కరమమైన; మతిన్ = మనసున; ఆ = ఆ; తపంబున్ = తపస్సును; తగన్ = అవశ్యము; కైకొని = చేపట్టి; చేసిన = చేసినట్టి; బ్రహ్మసౌఖ్యమున్ = బ్రహ్మానందము (ముక్తి); తిరముగన్ = స్థిరముగ; కల్గు = కలిగించెడి; వృద్ధులనున్ = ముసలివారిని; దీనులన్ = దీనులను; ప్రోవుడు = కాపాడండి; దుష్ట = చెడ్డ; వర్తనన్ = ప్రవర్తనతో; జరుగుచునుండు = నడచెడి; కాముకులన్ = కాముకుల; సంగతిన్ = సాంగత్యమునకు; పోకుడు = పోకండి; మీదన్ = రాబోవు కాలములో; మేలున్ = మంచి; అగున్ = అగును.

భావము:

ఏ తపస్సు వల్ల మానవులకు తరగని సుఖం లభిస్తుందో అలాంటి తపస్సును అవలంబిస్తే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్ధులను, దీనులను దయతో కాపాడండి. చెడు మార్గాలలో నడిచే కాముకుల సహవాసాన్ని పూర్తిగా వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది.