పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని తపంబు

  •  
  •  
  •  

5.1-66-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషభుండు రాజ్యంబు చేయుచు నుండి-
యంతట నొక్కనాఁ డాత్మయందుఁ
లపోసి భూలోక ల మపేక్షింపక-
మోహంబు దిగనాడి పుత్రులకును
నరాజ్య మెల్ల నప్పన చేసి వెనువెంటఁ-
గొడుకులు మంత్రులుఁ గొలిచిరాఁగ
ల్లన యరిగి బ్రహ్మావర్త దేశంబు-
నందుల నపుడు మహాత్ములయిన

5.1-66.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి మునిజన సమ్ముఖంబందుఁ జేరి
నదు పుత్రుల నందఱ డాయఁ బిలిచి
రమ పుణ్యుండు ఋషభుండు ప్రణయ మొప్ప
ర్ష మందుచు నప్పు డిట్లనుచుఁ బలికె.

టీకా:

ఆ = ఆ; ఋషభుండు = ఋషభుడు; రాజ్యంబున్ = రాజ్యమును; చేయుచునుండి = చేయుచూ; అంతటన్ = అంతట; ఆత్మ = మనసు; అందున్ = లో; తలపోసి = భావించి; భూలోక = భూలోకమునకు సంబంధించిన; ఫలమున్ = ఫలితములను; అపేక్షింపక = ఆశించకుండగ; మోహంబున్ = మోహమును; దిగనాడి = వదలివేసి; పుత్రులు = కుమారుల; కునున్ = కు; తన = తనయొక్క; రాజ్యము = రాజ్యము; ఎల్లన్ = అంతటిని; అప్పనజేసి = అప్పజెప్పి; వెనువెంటన్ = కూడా; కొడుకులున్ = కుమారులు; మంత్రులున్ = మంత్రులు; కొలిచి = సేవించుతూ; రాగ = వస్తుండగా; అల్లన = మెల్లగా; అరిగి = వెళ్ళి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము యనెడి; దేశంబున్ = దేశముల; అందులన్ = లో; అపుడున్ = అప్పుడు; మహాత్ములు = గొప్పవారు; అయిన = అయిన.
అట్టి = అటువంటి; ముని = మునులైన; జన = వారి; సమ్ముఖంబున్ = ఎదుటి; అందున్ = అందు; చేరి = చేరి; తనదు = తన యొక్క; పుత్రులన్ = కుమారులను; అందఱన్ = అందరిని; డాయన్ = దగ్గరకు; పిలిచి = పిలిచి; పరమ = అత్యుత్తమ; పుణ్యుండు = పుణ్యముగలవాడు; ఋషభుండు = ఋషభుడు; ప్రణయమొప్ప = ప్రేమయుప్పొంగగా; హర్షమున్ = సంతోషమును; అందుచున్ = పొందుతూ; అప్పుడున్ = అప్పుడు; ఇట్లు = ఈ విధముగ; అనుచున్ = అంటూ; పలికెన్ = పలికెను.

భావము:

ఆ ఋషభుడు రాజ్యపాలన చేస్తూ ఒకనాడు ఇహలోక ఫలాన్ని అపేక్షించక, మోహాన్ని వదలిపెట్టి, కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. తరువాత కొడుకులు, మంత్రులు తనను అనుసరించగా బ్రహ్మావర్త దేశానికి బయలుదేరాడు. అక్కడ మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారుల నందరినీ దగ్గరకు పిలిచి మహాపుణ్యాత్ముడైన ఋషభుడు సంతోషంతో ఇలా అన్నాడు.