పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-63-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూవరుఁ డగు ఋషభుఁడు దన రాజ్యంబుఁ-
ర్మభూమిఁగ నాత్మఁ గాంచి జనుల
కందఱకును బ్రియం గునట్లు కర్మ తం-
త్రంబెల్లఁ దెలుపంగఁ లఁచి కర్మ
ములు చేయుటకు గురువులయొద్ద వేదంబు-
దివి వారల యనుజ్ఞను వహించి
తమన్యుఁ డిచ్చిన తి జయంతీ కన్యఁ-
రిణయంబై యట్టి డఁతి వలన

5.1-63.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుఁ డాదిగ సుతుల నూర్వును గాంచె
ట్టి భరతుని పేరను వనితలము
పురవరాశ్రమ గిరితరుపూర్ణ మగుచు
మరి భారత వర్ష నామున మించె.

టీకా:

భూవరుడు = రాజు {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}; అగు = అయిన; ఋషభుడు = ఋషభుడు; తన = తన యొక్క; రాజ్యంబున్ = రాజ్యమును; కర్మభూమిగన్ = కర్మభూమిగా; ఆత్మన్ = మనసున; కాంచి = చూసి; జనుల్ = ప్రజల; కున్ = కు; అందఱకున్ = అందరికిని; ప్రియంబున్ = ఇష్టము; అగునట్లు = అగునట్లు; కర్మ = వేదకర్మల; తంత్రంబున్ = విధానమును; తెలుపన్ = తెలుసుకొన; తలంచి = భావించి; కర్మములున్ = వేదకర్మలను; చేయుట = చేయుట; కున్ = కు; గురువుల = గురువుల; యొద్దన్ = వద్ద; వేదంబున్ = వేదములను; చదివి = చదువుకొని; వారల = వారి యొక్క; అనుజ్ఞనున్ = అనుమతిని; వహించి = స్వీకరించి; శతమన్యుడు = శతమన్యుడు; ఇచ్చిన = ఇచ్చినట్టి; సతిన్ = స్త్రీని; జయంతీ = జయంతి యనెడి; కన్యన్ = కన్యను; పరిణయంబున్ = వివాహము; ఐ = అయ్యి; అట్టి = ఆ యొక్క; పడతి = స్త్రీ; వలన = వలన.
భరతుడు = భరతుడు; ఆదిగ = మొదలైన; సుతులన్ = పుత్రులను; నూర్వురన్ = నూరుమందిని; కాంచెన్ = పుట్టించెను; అట్టి = అటువంటి; భరతుని = భరతుని; పేరను = పేరుతో; అవనితలమున్ = భూమండలము; పురవర = ఉత్తమమైన పురములు; ఆశ్రమ = ఆశ్రమములు; గిరి = పర్వతములు; తరు = వృక్షములతో; పూర్ణము = నిండినది; అగుచున్ = అగుచూ; అమరి = చక్కగానుండెడి; భారతవర్ష = భారతవర్షముయనెడి; నామమునన్ = పేరుతో; మించెన్ = అతిశయించెను.

భావము:

ఋషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి, కర్మతంత్రాన్ని జనులందరికీ ఇష్టమయ్యే విధంగా తెలియజేయా లనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్దకు చేరాడు. వారి ఆజ్ఞను శిరసావహించి దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రశస్తిని పొందింది.