పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుని జన్మంబు

 •  
 •  
 •  

5.1-63-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భూవరుఁ డగు ఋషభుఁడు దన రాజ్యంబుఁ-
ర్మభూమిఁగ నాత్మఁ గాంచి జనుల
కందఱకును బ్రియం గునట్లు కర్మ తం-
త్రంబెల్లఁ దెలుపంగఁ లఁచి కర్మ
ములు చేయుటకు గురువులయొద్ద వేదంబు-
దివి వారల యనుజ్ఞను వహించి
తమన్యుఁ డిచ్చిన తి జయంతీ కన్యఁ-
రిణయంబై యట్టి డఁతి వలన

5.1-63.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తుఁ డాదిగ సుతుల నూర్వును గాంచె
ట్టి భరతుని పేరను వనితలము
పురవరాశ్రమ గిరితరుపూర్ణ మగుచు
మరి భారత వర్ష నామున మించె.

టీకా:

భూవరుడు = రాజు {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}; అగు = అయిన; ఋషభుడు = ఋషభుడు; తన = తన యొక్క; రాజ్యంబున్ = రాజ్యమును; కర్మభూమిగన్ = కర్మభూమిగా; ఆత్మన్ = మనసున; కాంచి = చూసి; జనుల్ = ప్రజల; కున్ = కు; అందఱకున్ = అందరికిని; ప్రియంబున్ = ఇష్టము; అగునట్లు = అగునట్లు; కర్మ = వేదకర్మల; తంత్రంబున్ = విధానమును; తెలుపన్ = తెలుసుకొన; తలంచి = భావించి; కర్మములున్ = వేదకర్మలను; చేయుట = చేయుట; కున్ = కు; గురువుల = గురువుల; యొద్దన్ = వద్ద; వేదంబున్ = వేదములను; చదివి = చదువుకొని; వారల = వారి యొక్క; అనుజ్ఞనున్ = అనుమతిని; వహించి = స్వీకరించి; శతమన్యుడు = శతమన్యుడు; ఇచ్చిన = ఇచ్చినట్టి; సతిన్ = స్త్రీని; జయంతీ = జయంతి యనెడి; కన్యన్ = కన్యను; పరిణయంబున్ = వివాహము; ఐ = అయ్యి; అట్టి = ఆ యొక్క; పడతి = స్త్రీ; వలన = వలన.
భరతుడు = భరతుడు; ఆదిగ = మొదలైన; సుతులన్ = పుత్రులను; నూర్వురన్ = నూరుమందిని; కాంచెన్ = పుట్టించెను; అట్టి = అటువంటి; భరతుని = భరతుని; పేరను = పేరుతో; అవనితలమున్ = భూమండలము; పురవర = ఉత్తమమైన పురములు; ఆశ్రమ = ఆశ్రమములు; గిరి = పర్వతములు; తరు = వృక్షములతో; పూర్ణము = నిండినది; అగుచున్ = అగుచూ; అమరి = చక్కగానుండెడి; భారతవర్ష = భారతవర్షముయనెడి; నామమునన్ = పేరుతో; మించెన్ = అతిశయించెను.

భావము:

ఋషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి, కర్మతంత్రాన్ని జనులందరికీ ఇష్టమయ్యే విధంగా తెలియజేయా లనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్దకు చేరాడు. వారి ఆజ్ఞను శిరసావహించి దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రశస్తిని పొందింది.

5.1-64-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆ మహాభారతవర్షంబునందుఁ దమతమ పేరంబరఁగు భూములకుఁ గుశావర్తేలావర్త బ్రహ్మావర్తార్యావర్త మలయకేతు భద్రసేనేంద్రస్పృగ్వి దర్భ కీకటులను తొమ్మండ్రు కుమారులను దక్కుంగల తొమ్మండ్రు పుత్రులకుఁ బ్రధానులం జేసె; నంతం గవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమీఢ చమస కరభాజను లనువారు తొమ్మండ్రును భాగవత ధర్మప్రకాశకు లైరి; భగవన్మహి మోపబృంహితంబు లగు వారల చరిత్రంబులు ముంద రెఱింగించెదఁ; దక్కిన యెనుబదియొక్క కుమారులు పిత్రాదేశకరులు నతి వినీతులు మహాశ్రోత్రియులు యజ్ఞశీలురుఁ గర్మనిష్ఠులు నయిన బ్రాహ్మణోత్తము లైరి; ఋషభుండు స్వతంత్రుండై సంసారధర్మంబులం బొరయక కేవలానందానుభవుం డయిన యీశ్వరుండై యుండియు బ్రాకృతుండునుం బోలెఁ గాలానుగతంబు లగు ధర్మంబుల నాచరించుచు ధర్మప్రవర్తకులకు సముండును నుపశాంతుండును మైత్రుండును గారుణికుండును నై ధర్మార్థ యశః ప్రజానందామృతావరోధంబుచే గృహస్థాశ్రమంబులం బ్రజల నియమించుచుఁ గొంత కాలంబు నీతిమార్గంబు దప్పక ప్రజాపాలనంబు చేయుచు వేదరహస్యంబు లగు సకల ధర్మంబులును స్వవిదితంబు లయినను బ్రాహ్మణోపదేశ పూర్వకంబుగా ద్రవ్య దేశ కాల వయశ్శ్రద్ధర్త్విగ్వి ధోద్దేశోపచితంబులుగ నొక్కక్క క్రతువును శతవారంబు యథావిధిగఁ జేసి సుఖం బుండె; నంత.

టీకా:

ఆ = ఆ; మహా = గొప్ప; భారతవర్షంబున్ = భారతవర్షము; అందున్ = అందు; తమతమ = వారివారి; పేరన్ = పేర్లతో; భూముల్ = దేశముల; కున్ = కు; కుశావర్త = కుశావర్తుడు {కుశావర్తము - నేర్పరులు కల దేశము}; ఇలావర్త = ఇలావర్తుడు {ఇలావర్తము - గో భూమి}; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తుడు {బ్రహ్మావర్తము - బ్రహ్మ జ్ఞానులు తిరిగెడి నేల}; ఆర్యావర్త = ఆర్యావర్తుడు {ఆర్యావర్తము - ఆర్యులు తిరిగెడి నేల}; మలయకేతు = మలయకేతుడు {మలయకేతు - మలయు (తపసు చేయుటకు) కేతు (గుర్తు కలది), తపో భూమి}; భద్రసేన = భద్రసేనుడు {భద్రసేన - శుభము అధికముగ కల ప్రదేశము}; ఇంద్రస్పృక్ = ఇంద్రస్పృశుడు {ఇంద్రస్పృక్ - ఇంద్రుడు స్పర్శించెడ ప్రదేశము}; విదర్భ = విదర్భుడు {విదర్భ - శ్రేష్ఠమైన దర్భలు గల దేశము}; కీకటుల్ = కీకటుడు {కీకట - గ్రామ ప్రదేశము}; అను = అనెడి; తొమ్మండ్రన్ = తొమ్మిదిమంది; కుమారులన్ = పుత్రులను; తక్కుంగల = మిగిలినవారైన; తొమ్మండ్రున్ = తొమ్మిదిమంది; పుత్రుల = కుమారుల; కున్ = కు; ప్రధానులన్ = ప్రధానులుగ; చేసెన్ = చేసెను; అంతన్ = అంతట; కవి = కవి; హరి = హరి; అంతరిక్ష = అంతరిక్షుడు; ప్రబుద్ధ = ప్రబుద్ధుడు; పిప్పలాయన = పిప్పలాయనుడు; అవిర్హోత్ర = అవిర్హోత్రుడు; ధ్రమీఢ = ధ్రమీఢుడు; చమస = చమసుడు; కరభాజనులు = కరభాజనుడు; అను = అనెడి; వారు = వారు; తొమ్మండ్రునున్ = తొమ్మిదిమంది; భాగవత = భాగవత; ధర్మ = ధర్మమును; ప్రకాశకులు = విస్తరించువారు; ఐరి = అయిరి; భగవత్ = భగవంతుని; మహిమ = గొప్పదనమును; ఉపబృంహితంబులు = వ్యాప్తిచేయునవి; అగు = అయిన; వారల = వారి యొక్క; చరిత్రంబులున్ = వర్తనలు; ముందఱన్ = ముందు; ఎఱింగించెదన్ = తెల్పెదను; తక్కిన = మిగిలిన; ఎనుబదియొక్క = ఎనభైఒక్క (81); కుమారులున్ = పుత్రులు; పితృ = తండ్రి; ఆదేశ = ఆజ్ఞలను; కరులున్ = పాలించువారు; అతి = మిక్కిలి; వినీతులున్ = నీతిమంతులు; మహా = గొప్ప; శ్రోత్రియులున్ = వేదమార్గ నిష్ఠ గలవారు; యజ్ఞ = యజ్ఞములను; శీలురు = స్వభావము గలవారు; కర్మ = వేదకర్మాచరణలో; నిష్ఠులున్ = నిష్ఠ గలవారు; అయిన = అయిన; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; ఉత్తములు = ఉత్తములు; ఐరి = అయ్యిరి; ఋషభుండు = ఋషభుడు; స్వతంత్రుండు = స్వతంత్రుడు; ఐ = అయ్యి; సంసార = గృహస్తు; ధర్మములన్ = ధర్మములను; పొరయక = చెందక; కేవల = కేవలము; ఆనంద = ఆనందమును; అనుభవుండు = అనుభవించు చుండెడివాడు; అయిన = అయినట్టి; ఈశ్వరుండు = భగవంతుడు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; ప్రాకృతుండునున్ = పామరుని; పోలెన్ = వలె; కాల = కాలమునకు; అనుగతంబులు = అనుసరించునవి; అగు = అయిన; ధర్మంబులన్ = ధర్మములను; ఆచరించుచున్ = ఆచరించుతూ; ధర్మ = ధర్మమును; ప్రవర్తకుల్ = నడిపించెడివారి; కున్ = కి; సముండునున్ = తగినవాడును; ఉపశాంతుండునున్ = ఉపశమనము కూర్చెడివాడు; మైత్రుండునున్ = మిత్రుడును; కారుణికుండును = ప్రయోజనములను కలిగించెడివాడు; ధర్మ = ధర్మము; అర్థ = సంపదలు; యశః = కీర్తి; ప్రజా = సంతానము; ఆనంద = ఆనందములు; అమృత = అమృతముల; అవరోధంబున్ = ఊడలుదిగట; చేన్ = వలన; గృహస్థ = గార్హస్థ; ఆశ్రమంబులన్ = ఆశ్రమములో; ప్రజలన్ = లోకులను; నియమించుచున్ = నియమిస్తూ; కొంత = కొంత; కాలంబున్ = సమయము; నీతి = నీతి; మార్గంబున్ = దారి; తప్పక= తప్పిపోకుండగ; ప్రజా = ప్రజలను; పాలనంబున్ = పరిపాలించుట; చేయుచున్ = చేయుచూ; వేద = వేదము లందలి; రహస్యంబులు = రహస్యములు; అగు = అయిన; సకల = సర్వ; ధర్మంబులునున్ = ధర్మములు; స్వ = తనకు; విదితంబులు = తెలిసినవే; అయినను = అయినప్పటికి; బ్రాహ్మణ = బ్రాహ్మణులచే; ఉపదేశ = ఉపదేశింపబడుట; పూర్వకంబుగాన్ = కూడినదిగాను; ద్రవ్య = పదార్థములు; దేశ = ప్రదేశముల; కాల = సమయముల; వయస్ = వయస్సులు; శ్రద్ధా = శ్రద్ధ; ఋత్విక్ = యజ్ఞనిర్వహకులు; విధ = విధానములు; ఉద్దేశ = ఉద్దేశ్యములు; ఉపచితంబులుగన్ = సరి అగునవి సంపాదించి; ఒక్కొక్క = ప్రతి ఒక్క; క్రతువును = యజ్ఞమును; శత = నూరు (100); వారంబున్ = మారులు, పర్యాయములు; యథావిధిగన్ = పద్ధతి ప్రకారముగ; చేసి = చేసి; సుఖంబున్ = సుఖముగా; ఉండెన్ = ఉండెను; అంత = అంతట.

భావము:

ఆ భరతవర్షంలోని ఆయా భాగాలకు భరతుడు తన తొంబది తొమ్మిది మంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందిని ప్రధానులుగా నియమించాడు. వారి కప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధి పొందాయి. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు అనే తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమలను వ్యాప్తి చేసే వారి చరిత్రలను నీకు తరువాత చెపుతాను. తక్కిన ఎనభైయొక్క మంది కుమారులు తమ తండ్రి ఋషభుని మాటను జవదాటనివాళ్ళు. వారంతా మహావినయ సంపన్నులు. వేదధర్మాలను అనుష్ఠించేవాళ్ళు. యాగాలన్నా కర్మలన్నా శ్రద్ధ కలవాళ్ళు. అందుచేత వాళ్ళు బ్రాహ్మణోత్తములుగా పేరు గడించారు. ఋషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకొనలేదు. స్వతంత్రుడై మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడైనా సామాన్యుడిగా ప్రవర్తించాడు. ఆయా కాలాలలో చేయదగిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మ ప్రవర్తకుల పట్ల సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంతస్వభావంతో జీవుల పట్ల దయ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్థం, కీర్తి, సంతతి, ఆనందం. అమృతత్వం చక్కగా సాగడం కోసం గృహస్థాశ్రమాన్ని పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. ఈ విధంగా ఋషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేసాడు. వేదాలలోని ధర్మరహస్యాలను తనకు అవగతమైనా బ్రాహ్మణులు బోధించినట్లు, ఋత్విక్కులు ఉపదేశించినట్లు వస్తు సంభారాలతో దేశకాలానుగుణంగా శ్రద్ధాపూర్వకంగా తన వయస్సుకు తగినట్లు ఒక్కొక్క యాగాన్ని వంద పర్యాయాలు యథావిధిగా చేసి సుఖజీవనం గడిపాడు. అప్పుడు…

5.1-65-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వర ఋషభుని రాజ్యం
బు నైహిక ఫలముఁ గోరు పురుషుని నొకనిం
నుఁగొన నెఱుంగ మెన్నఁడు
నితేజుం డతనిమహిమ లేమని చెప్పన్.

టీకా:

జనవర = రాజ; ఋషభుని = ఋషభుని; రాజ్యంబునన్ = రాజ్యములో; ఐహిక = ఇహలోకపు; ఫలమున్ = ఫలితములను; కోరు = కోరెడి; పురుషునిన్ = మానవుని; ఒకనిన్ = ఒక్కనినైన; కనుగొన = చూడగలుగుట; ఎఱుంగము = తెలియము; ఎన్నడున్ = ఎప్పుడును; ఇన = సూర్యునితో సమానమైన; తేజుండు = తేజస్సు గలవాడు; అతని = అతని యొక్క; మహిమల్ = గొప్పదనములు; ఏమని = ఏమని; చెప్పన్ = చెప్పను.

భావము:

రాజా! ఆ ఋషభుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడు కూడా కనిపించడు. అతడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించాలి?