పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని రాజ్యాభిషేకము

  •  
  •  
  •  

5.1-59-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ది యెఱింగి ఋషభుఁ డంతట యోగ మా
యా బలంబు కతన ఖిల రాజ్య
మందుఁ గురియఁ జేసె త్యంత సంపూర్ణ
వృష్టి దినదినంబు వృద్ధిఁ బొంద.

టీకా:

అది = దానిని; ఎఱింగి = తెలిసి; ఋషభుడు = ఋషభుడు; అంతటన్ = అంతట; యోగమాయా = యోగమాయ యొక్క; బలంబున్ = బలము; కతన = వలన; అఖిల = సమస్తమైన; రాజ్యము = రాజ్యము; అందున్ = అంతటను; కురియన్ = కురియునట్లు; చేసెను = చేసెను; అత్యంత = అత్యధికమైన; సంపూర్ణ = నిండు; వృష్టిన్ = వర్షమును; దినదినంబున్ = ప్రతిదినము; వృద్ధి = అధికము; పొందన్ = అగునట్లు.

భావము:

ఇంద్రుని ఆ దౌష్ట్యాన్ని ఋషభుడు గుర్తించి తన యోగమాయతో దినదినాభివృద్ధిగా సర్వ సమృద్ధిగా రాజ్యమంతట వర్షం కురిపించాడు.