పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని రాజ్యాభిషేకము

  •  
  •  
  •  

5.1-57-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీసురులును మంత్రులుఁ
రివారము హితులుఁ బ్రజలు బాంధవులును సు
స్థిమతి నా బాలకునిం
మనురాగమున రాజుగాఁ జూచి రిలన్.

టీకా:

ధరణీసురులును = బ్రాహ్మణులు; మంత్రులున్ = మంత్రులు; పరివారమున్ = సేవకులు; హితులున్ = స్నేహితులు; ప్రజలున్ = ప్రజలు; బాంధవులునున్ = బంధువులు; సుస్థిరమతిన్ = నిశ్చలమైన మనసుతో; ఆ = ఆ; బాలకునిన్ = పిల్లవానిని; కరము = మిక్కిలి; అనురాగమునన్ = ప్రీతితో; రాజుగా = రాజు అగునట్లు; చూచిరి = చూసిరి; ఇలన్ = నేలపైన.

భావము:

బ్రాహ్మణులు, మంత్రులు, పరివారం, హితులు, ప్రజలు, బంధువులు అనురాగాతిశయంతో చిన్నపిల్లవాడు అయిన ఆ ఋషభుని తమ రాజు గానే భావించారు.