పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-53-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాకాది లోకములలో
నాకున్ సరివచ్చు నట్టి నందను నెటు నా
లోకింప లేరు; గావున
నాకున్ సరి నేన కా మమున నెఱుఁగుఁడీ.

టీకా:

నాక = స్వర్గము; ఆది = మొదలగు; లోకములలోన్ = లోకము లయందు; నాకున్ = నాకు; సరివచ్చునట్టి = సాటి ఐనట్టి; నందనున్ = పుత్రుని; ఎటున్ = ఏ విధముగను; ఆలోకింపలేరు = చూడలేరు; కావునన్ = కనుక; = నాకున్ = నాకు; సరి = సాటి; నేన = నేను మాత్రమే; కాన్ = అయినట్లు; మనమునన్ = మనసులలో; ఎఱుగుడీ = తెలిసికొనండి.

భావము:

స్వర్గాది లోకాలలో నాకు సాటి రాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే అని మీరు తెలుసుకొనండి.