పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-50-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మీయఁ దలఁచి మమ్ముం
రుణించితి గాక; నిన్నుఁ నుగొనుటకునై
సి నుతింపఁగ మాకుం
మగునే? వరద! నీరశ్యామాంగా!

టీకా:

వరమున్ = వరములను; ఈయన్ = ఇవ్వవలెనని; తలచి = భావించి; మమ్మున్ = మమ్ములను; కరుణించితి = దయచూపితివి; కాక = అంతేకాని; నిన్నున్ = నిన్ను; కనుగొనుట = తెలిసికొనుట; కున్ = కోసము; ఐ = అయ్యి; అరసి = తరచిచూసుకొని; నుతింపగన్ = స్తుతించుటకు; మాకున్ = మాకు; తరమున్ = సాధ్యము; అగునే = అగునా ఏమి; వరద = నారాయణ {వరద - వరములను ద (ఇచ్చువాడు), విష్ణువు}; నీరదశ్యామాంగా = నారాయణ {నీరద శ్యామాంగ - నీరదము (మేఘము) వంటి శ్యామాంగ (నల్లని దేహము గలవాడు), విష్ణువు}.

భావము:

కోరిన కోరికలను అనుగ్రహించేవాడా! నీలమేఘం వంటి శరీరచ్ఛాయ కలవాడా! వరమివ్వడానికి నీవు మా ముందు సాక్షాత్కరించావు. నిన్ను సందర్శించడానికి కాని సంస్తుతించడానికి కాని మాకు సాధ్యమౌతుందా?