పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-49-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుడు మేము నీకు నిష్టంబు లగు పూజ
లాచరింపకున్న నైన నధిక
యిన నీ కృపాకటాక్ష వీక్షణములఁ
క్కఁ జూచి తగఁ బ్రన్నుఁ డగుచు.

టీకా:

ఇపుడున్ = ఇప్పుడు; మేమున్ = మేము; నీకున్ = నీకు; ఇష్టంబులు = ప్రీతికరములు; అగు = అయిన; పూజలున్ = పూజలను; ఆచరింపకున్నన్ = ఆచరింపకపోయి; ఐననున్ = అయినను; అధికమయిన = మిక్కిలి; = నీ = నీ యొక్క; కృపా = దయతోకూడిన; కటాక్ష = కడగంటి; వీక్షణములన్ = చూపులతో; చక్కన్ = చక్కగా; చూచి = చూసి; తగన్ = అవశ్యము; ప్రసన్నుడు = ప్రసన్నమైనవాడు; అగుచున్ = అగుచూ.

భావము:

ఇప్పుడు మేము నీకు సంతృప్తి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయక పోయినా మా మీద కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింప జేసి ప్రసన్నుడవైనావు.