పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-48-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలిశుల మగుచు మిక్కిలి
మే లెఱుగని మమ్ము నీదు మించిన దయచేఁ
బాలింతు విత్తు వెప్పుడుఁ
జాలఁగ నిహపరములందు కల సుఖములున్.

టీకా:

బాలిశులము = మూర్కులము; అగుచున్ = అగుచూ; మిక్కిలి = అధికమైన; మేలు = మంచి; ఎఱుగని = తెలియని; మమ్మున్ = మమ్ములను; నీదు = నీ యొక్క; మించిన = అతిశయించిన; దయ = కృప; చేన్ = తోటి; పాలింతువు = పరిపాలించెదవు; ఇత్తువు = ఇచ్చెదవు; ఎపుడున్ = ఎల్లప్పుడును; చాలగన్ = అదికముగా; ఇహ = ఇహలోకము; పరములు = పరలోకమున; అందున్ = లోను; = సకల = సమస్తమైన; సుఖములన్ = సౌఖ్యములను.

భావము:

మూర్ఖులమైన మాకు ఏది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు.